Sunday, 6 June 2021

Good Luck Sakhi : కీర్తి సురేష్ సినిమా చుట్టూ రచ్చ.. రూమర్లను ఖండించిన నిర్మాణ సంస్థ

ప్రస్తుతం ఓటీటీ నిర్మాణ సంస్థల దూకుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఓటీటీ సంస్థలు గాలమేస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌ను చూపిస్తూ సినిమాలను తమ సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో థియేటర్ల ప్రారంభమయ్యే అవకాశమే లేదు. ప్రారంభమైనా కూడా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే నడపాల్సి వస్తుంది. అలా కొన్ని సినిమాలు, నిర్మాతలు మాత్రం ఓటీటీకే ఓటు వేస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా మీద ఇప్పుడు రూమర్లు ఎక్కువవుతున్నాయి. తెలుగులో కొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టేందుకు రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో పాగల్, నితిన్ కొత్త సినిమా, కీర్తి సురేష్ వంటి సినిమాలు ఓటీటీలో రాబోతోన్నట్టు టాక్ వస్తోంది. ఇప్పటికే కీర్తి సురేష్ సినిమాలైన పెంగ్విన్, మిస్ ఇండియా వంటివి ఓటీటీలోనే వచ్చాయి. గత ఏడాది వచ్చిన ఈ చిత్రాలు దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకున్నాయి. అలా ఇప్పుడు కీర్తి సురేష్ నటించిన మరో సినిమా కూడా ఓటీటీలో రాబోతోందనే రూమర్ బయటకు వచ్చింది. జగపతి బాబు, ఆది, కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే వదిలిన టీజర్, పోస్టర్ ఇలా అన్నీ మంచి స్పందనను తెచ్చుకున్నాయి. అయితే ఈ చిత్రం ఓటీటీలో రాబోతోందనే రూమర్లను నిర్మాతలు తాజాగా ఖండించారు. మీడియాలో వస్తోన్న వార్తలన్నీ అవాస్తం.. వాటిని నమ్మకండి.. ఇంకా ఏమీ అనుకోలేదు.. ఒక వేళ ఏదైనా సమాచారం ఉంటే మేమే అధికారికంగా చెబుతామని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35166bb

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....