'' ప్రతిసారి ఈ అంశం జనాల్లో ఓ రేంజ్ చర్చలకు దారి తీస్తోంది. ఫిలిం నగర్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కి రసవత్తరంగా మారుతోంది. ఈ సారైతే ఈ ఎన్నికల పోరు మరింత ఉత్కంఠను రేపుతోంది. అధ్యక్ష పదవి కోసం మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు, సీనియర్ నటుడు , టాలీవుడ్ ఫేమస్ యాక్టర్ జీవిత రాజశేఖర్ సహా హేమ పోటీ పడుతుండటం రాజకీయ వేడిని తలపిస్తోంది. ఈ పరిస్థితుల నడుమ నిన్న (గురువారం) సాయంత్రం తన ప్యానెల్‌ని ప్రకటించిన ప్రకాష్ రాజ్.. కొద్దిసేపటి క్రితం ప్యానల్ సభ్యులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుడైన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎప్పటిలాగే తనదైన స్టైల్ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. దాదాపు 23 ఏళ్లుగా ప్రకాష్ రాజ్ పరిచయం అని, ఆయన్ను చూసి కొన్ని వందల సార్లు ఇరిటేట్ అయ్యానని చెబుతూనే కొన్ని లక్షల సార్లు ప్రేమించాను అని చెప్పారు బండ్ల గణేష్. ప్రకాష్ రాజ్ చాలా మంచి వ్యక్తి అని, తన ఊరు షాద్ నగర్ దగ్గర కొండారెడ్డి పల్లె అనే విలేజ్‌ని దత్తత తీసుకొని.. కోవిడ్ కష్ట సమయంలో ఎంతో మందిని తన సొంత డబ్బుతో ఆదుకున్నారని ఆయన తెలిపారు. ఎంతోమంది ఆర్టిస్టుల పిల్లల పెళ్లిళ్లకు లక్షలు పంపించడం నేను కళ్లారా చూశాను. ప్రకాష్ రాజ్ లోకల్ వాడు కాదు నాన్ లోకల్ అని కామెంట్ చేయడం సరికాదు. మేమంతా 'మా' మనుషులం. 27 సంవత్సరాల క్రింద చిరంజీవి అధ్యక్షుడిగా ఏర్పాటు చేసిన 'మా'లో ఇప్పటిదాకా ప్రతి ఒక్క ప్రెసిడెంట్ బాగా పనిచేశారు. కానీ ప్రకాష్ రాజ్ ఏం చేసైనా 100 మైళ్ళు అవలీలగా పరుగెత్తి, 'మా' వృద్ధిలో భాగమవుతాడనే నమ్మకంతోనే ఆయన వెనకాల నిలబడ్డాను. పేద కళాకారులకు 'మా' ఉంది అని భరోసా కల్పించడానికి ప్రకాష్ రాజ్ లాంటి వారు ఉండాలి. ఇక్కడ లోకల్.. నాన్ లోకల్ అనే తేడా అవసరం లేదు. ఇక్కడి ప్రభాస్ ఇండియాను ఏలుతున్నాడు. రాజమౌళిని ఇంగ్లీష్ వాళ్ళు సినిమా తీయమని అడుగుతున్నారు. గర్వపడాలి మనం. ఆయన దత్తత తీసుకున్న ఊళ్ళో ప్రతి ఒక్కరూ ప్రకాష్ రాజ్ పేరును గుండెలపై పెట్టుకున్నారు. 'మా' డెవలప్‌మెంట్ కోసం ప్రకాష్ రాజ్ అహర్నిశలు కష్టపడతాడని నమ్ముతున్నా. ప్రకాష్ రాజ్ విలువలతో కూడుకున్న ఒక మంచి మనిషి. 27 సంవత్సరాల తర్వాత 'మా' అసోసియేషన్‌కి సొంత బిల్డింగ్ ఉంటుందని భరోసాగా చెబుతున్నా. ఆ సత్తా ఒక్క ప్రకాష్ రాజ్‌కి మాత్రమే ఉంది'' అని బండ్ల గణేష్ చెప్పారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xRIsul
No comments:
Post a Comment