Sunday, 6 June 2021

చావు బతుకుల్లో సినిమాటోగ్రఫర్.. కాపాడమంటూ వేడుకుంటోన్న మ్యూజిక్ డైరెక్టర్

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తాజాగా ఓ ట్వీట్ వేశారు. అందులో తన స్నేహితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలిపారు. ఆయన ప్రాణాలు కాపాడాలంటూ కొందరు సినీ ప్రముఖలను ఈ మ్యూజిక్ డైరెక్టర్ కోరారు. ఆయన ఆస్పత్రి ఖర్చుల కోసం దాదాపు పది లక్షల మేరకు అవసరం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కీట్టో సంస్థ ద్వారా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇందులో ఇప్పటికే కొందరు సెలెబ్రిటీలు విరాళాలు అందించి సాయం చేశారు. శ్రీచరణ్ పాకాల గూఢచారి సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అలా అడివి శేష్‌తో ఉన్న అనుబంధంతోనే ఆయన్ను కూడా విరాళం ఇవ్వమని అడిగారు. తన ఫ్రెండ్.. ఇప్పుడిప్పుడే సినిమాటోగ్రఫర్‌గా ఎదుగుతున్నారు.. ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.. దయేచేసి సాయం చేయండి అని , కోన వెంకట్, వంటి వారిని వేడుకున్నారు. ఇందులో ఇప్పటికే సత్యదేవ్ స్పందించారు. తన వంతు సాయం చేసేశాను అంటూ ట్వీట్ వేశారు సత్యదేవ్. అలా వెంటనే సత్యదేవ్ స్పందించినందుకు శ్రీచరణ్ పాకాలా ధ్యాంక్స్ చెప్పారు. సాయం చేసినందుకు చేతులెత్తి మొక్కేశారు. ఇక మిగిలిన సెలెబ్రిటీలు ఎప్పుడు స్పందిస్తారో చూడాలి. ఈ విషయాన్ని వీలైనంత మందికి షేర్ చేసి సాయపడాల్సిందిగా అందరినీ కోరారు. సెలెబ్రిటీలే కాకుండా సామాన్యులు కూడా తమకు తోచిన సాయాన్ని అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక శ్రీచరణ్ పాకాల కెరీర్ విషయానికొస్తే.. క్షణం, గరుడవేగ, అశ్వథ్థామ, గూఢచారి వంటి సినిమాలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ghqsSQ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....