సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటోందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా గత నెల రోజుల నుంచి క్షణం తీరిక లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూనే ఉన్నారు. సాయం అంటూ అడిగిన ప్రతీ ఒక్కరికీ వీలైనంతలో తోడ్పాటునందిస్తున్నారు. అలా రేణూ దేశాయ్ ఎంతో మంది కోవిడ్ పేషెంట్స్‌కి సాయమందించారు. ఉపాధి కోల్పోయిన తినడానికి తిండి లేని వారికి నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. అలా రేణూ దేశాయ్ ఈ సెకండ్ వేవ్‌లో పలువురికి సాయం చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. రేణూ దేశాయ్ చేసే ఈ సహాయ కార్యక్రమాలపై అప్పుడప్పుడు నెగెటివ్ కామెంట్లు వినిపిస్తుంటాయి. నేరుగా డబ్బు సాయం చేయలేనని పదే పదే చెప్పినా కూడా పలువురు నెటిజన్లు మాత్రం ఆర్థిక సాయాన్ని కోరుతుంటారు. ఇంకొందరైతే హద్దులు దాటి మరీ ప్రవర్తిస్తున్నారు. డబ్బు సాయం అందించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి అనవసరపు సందేశాలు ఎక్కువ అవుతున్నాయనే ఉద్దేశ్యంతో రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రాం ఇన్ బాక్స్‌ను మూసేశారు. ఏ సాయం కావాలన్నా కూడా కామెంట్ల రూపంలో తెలపండి, తనకు సంబంధించిన ఎన్జీవోలు చూసుకుంటాయని తెలిపారు. అయితే తాజాగా రేణూ దేశాయ్‌కి ఓ వింత అనుభవం ఎదురైంది. ఇప్పుడు ఈజీ బ్యాంకింగ్‌లో భాగంగా ప్రతీ ఒక్క బ్యాంక్ తమకు సంబంధించిన స్పెషల్ యాప్‌లను అందుబాటులోకి తెచ్చారు. అలా రేణూ దేశాయ్ తన బ్యాంకింగ్ యాప్ ద్వారా తన అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలని ప్రయత్నించారట. కానీ అలా చేసే క్రమంలో వేరే వారి ఖాతాలోకి లాగిన్ అయ్యారట. అలా ఎవరైనా తన ఖాతాలోకి కూడా వస్తే పరిస్థితి ఏంటని రేణూ దేశాయ్ సదరు బ్యాంకింగ్ సంస్థను ప్రశ్నించారు. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే ఎలాంటి సమాధానం రాలేదని రేణూ దేశాయ్ అన్నారు. మొత్తానికి ఈ యాప్‌లను వాడటంలో జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటనతో తెలుస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2T4apQg
No comments:
Post a Comment