Tuesday, 1 June 2021

ప్రతి ఒక్కరి అకౌంట్‌లో 5000.. కన్నడ హీరో యష్ గొప్ప మనసు.. వాళ్లందరికీ అండగా కేజీఎఫ్ స్టార్

కోవిడ్ సెకండ్ వేవ్ మరోసారి ప్రజల బ్రతుకులను చిద్రం చేసింది. దేశంలో కరోనా దాడికి అడ్డుకట్ట వేయాలనే ఆలోచనతో పలు చోట్ల లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాలపై ఆ ప్రభావం పడింది. ఎంతోమంది రోజు వారి కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ముఖ్యంగా మరోసారి సినీ ఇండస్ట్రీపై కోవిడ్ ఎఫెక్ట్ బాగా పడింది. ఎక్కడికక్కడ షూటింగ్స్, థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో సినీ కార్మికులు అల్లాడిపోతున్నారు. అయితే అలాంటి వారిని ఆదుకునేందుకు స్టార్ ముందుకొచ్చారు. లాక్ డౌన్ విధించడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొందని సినీ కార్మికులు వాపోతున్నారు. జేబులో చిల్లిగవ్వ లేక, చేద్దామంటే పని లేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని అంటున్నారు. వారి గోడు చూసి పలువురు ప్రముఖులు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ నటులకు గతంలో చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ పేరుతో సాయం చేశారు. ఇప్పుడు అదే బాటలో కన్నడ నటుల కోసం స్టార్ హీరో యష్ సాయం చేయడానికి సిద్ధమయ్యారు. కన్నడ సినీ పరిశ్రమలోని 21 డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్న 3వేల మంది సభ్యులకు ఒక్కొక్కరికి 5000 రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా యష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇది ఒంటరిగా పోరాడే సమయం కాదు, కాబట్టి మా సినిమా కళాకారులు, సాంకేతిక నిపుణులు మరియు కార్మికులకు తన వంతు సాయంగా ఈ సొమ్ము అందించబోతున్నట్లు తెలిపారు. నేరుగా సినీ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ అయ్యేలా ఆయన చర్యలు తీసుకోనున్నారు. ఈ చిన్న సాయం వారి కష్టాలనన్నింటినీ తీర్చలేదని తెలుసు కానీ ఎంతో కొంత ఊరటనిస్తుందని యష్ పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ibX6rx

No comments:

Post a Comment

'Imposing Hindi Will Affect BJP In Tamil Nadu'

'The vast majority of BJP supporters in Tamil Nadu can't speak any language other than Tamil.' from rediff Top Interviews http...