Sunday, 12 July 2020

Ram Gopal Varma: అమితాబ్ బచ్చన్ కోలుకోవాలని కోరుకోవడం లేదు.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్!

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీళ్ళిద్దరూ ముంబై లోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అమితాబ్ బచ్చన్‌కి కరోనా సోకిందని తెలిసి చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ చేశారు. ఈ క్రమంలో ఒక్క మాత్రం కోలుకోవాలని కోరుకోవడం లేదంటూ షాకింగ్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ''SARKAAAR మీరు కరోనా నుంచి కోలుకుంటారని నాకు తెలుసు. ఎప్పటిలాగే మరింత బలంగా తిరిగి వస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందుకే మీ కోసం నేను ప్రార్ధించను. కరోనా కారణంగా చనిపోతున్న వారి కోసం ప్రార్థిస్తాను'' అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. దీంతో ఆయనిచ్చిన ఈ వెరైటీ రియాక్షన్ చూసి నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. Also Read: తనకేదనిపిస్తే అది మొహమాటం లేకుండా చెప్పే వర్మ.. ఇలాంటి సెన్సిటివ్ విషయంలోనూ తన క్రియేటివిటీకి పదును పెట్టడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన ''పవర్ స్టార్, మర్డర్, 12'O Clock సినిమాలు రూపొందిస్తున్నారు. ఈ మూడు సినిమాలు అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2AOrViO

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....