Sunday, 12 July 2020

వైరల్ అవుతున్న అల్లు అర్జున్ పిల్లల ఫోటోలు... పోస్టు చేసిన స్నేహ

సినీ ప్రముఖులే కాదు.. వారి ఫ్యామిలీ కూడా ఏం చేసిన హాట్ టిపక్‌గా మారుతోంది. నిమిషాల్లో ఆ వార్త వైరల్ అయిపోతుంది. తాజాగా స్టైలిష్ స్టార్ ఫ్యామిలీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ భార్య స్నేహా రెడ్డి తమ ఇద్దరు పిల్లలకు చెందిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ ఫోటోల్ని బన్నీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. స్నేహ పోస్టు చేసిన ఫోటోల్లో బన్నీ పిల్లలు అయాన్, అర్హలు రెయిన్ కోట్ ధరించి వర్షంలో నిలుచొని ఉన్నారు. దీంతో ఆ ఫోటోల్ని కెమెరాలో బంధించారు. అందమైన గార్డెన్‌లో కలర్ రెయిన్ కోట్స్ ధరించి ఉన్న ఇద్దరు చిన్నారులు చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఈ ఫోటోల్ని బన్నీ వైఫ్ ఇనస్టాలో పోస్టు చేశారు. బన్నీతో పాటు.. మహేష్ బాబు ఫ్యామిలీ కూడా తమ పిల్లల ఫోటోల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు. తమ పిల్లలకు సంబంధించిన అన్నిరకాల అప్ డేట్స్‌ని కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32fJS5r

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....