పెరుగుతున్న టెక్నాలజీ సామాజిక మాధ్యమాలకు కొత్త శోభ తీసుకొస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా తమ తమ సినిమా విశేషాలతో పాటు రెగ్యులర్ అప్డేట్స్ ద్వారా నెటిజన్లను అట్రాక్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్‌ని ఫాలో అయ్యేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలోనే అక్కినేని కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ని అమాంతం పెంచుకొని అరుదైన మైలురాయిని దాటేసింది. ఎప్పటికప్పుడు అక్కినేని కుటుంబ విషయాలు, నాగచైతన్యతో వెకేషన్ టూర్ ఫొటోస్ పంచుకుంటూ అభిమానులతో లైవ్ చాట్ చేస్తుండే ఇన్స్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య నేటితో 11 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా అభిమానులకు స్పెషల్ థాంక్స్ చెబుతూ ఆమె ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేసింది. Also Read: గత పదేళ్లలో తానూ చేసిన సినిమాల్లోంచి పోటోలను తీసుకొని ఓ వీడియోగా రూపొందించి ఫ్యాన్స్ ముందు పెట్టింది సమంత. ''మంచి వాళ్లతో మరింత మంచి ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, మంచీ చెడు.. అన్నింటా నాకు అండగా మీరున్నట్లుగానే, మీ కోసం నేను ఉన్నట్టుగా భావిస్తున్నాను'' అని పేర్కొంటూ ఆ వీడియోపై ట్యాగ్ చేసింది సమంత. దీంతో ఆమెకు పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్నాక తన సినిమాల జోరు మరింత పెంచేసి భారీ పాపులారిటీ కూడగట్టుకుంది సమంత. ఇటీవలే ''ఓ బేబీ, యూటర్న్'' సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోందని సమాచారం. భర్త నాగచైతన్యతో కలిసి ఓ బ్యానర్ స్థాపించే పనిలో కూడా ఉందని తెలుస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eYQDLq
No comments:
Post a Comment