Saturday, 25 July 2020

కరోనాకి వ్యాక్సిన్ వచ్చాకే సినిమాలు చేస్తా లేదంటే..: మళ్లీ షాకిచ్చిన పవన్ కళ్యాణ్

తన అప్ కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చారు అధినేత పవర్ స్టార్ . 2019 ఎన్నికల ముందు సినిమాలకు గుడ్ బై చెప్పేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వకీల్ సాబ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హిందీలో హిట్ అయిన ‘పింక్’ను తెలుగులో వకీల్ సాబ్‌గా రిమేక్ చేస్తుంటగా.. ఇందులో లాయర్‌గా కనిపించారు పవర్ స్టార్. అయితే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తికాగా.. లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది. అయితే త్వరలో పవర్ స్టార్ సినిమా విడుదలౌతుందని పవన్ ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అజ్ఞాతవాసి చిత్రంతో నిరాశ పరిచిన పవర్ స్టార్ తిరిగి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. షూటింగ్‌కి ప్రభుత్వాల నుంచి సానుకూలమైన స్పందనలే ఉన్నా.. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్‌కి వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారు. మిగతా హీరోలైతే కొంచెం పరిస్థితి అదుపులోకి వస్తే షూటింగ్‌ మొదలుపెట్టేందుకు రెడీగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు సరేమిరా అంటున్నారు. తాజాగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌పై షాకింగ్ ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయనే చర్చ అటు ఆయన అభిమానుల్లోనూ... ఇటు చిత్ర వర్గాల్లోనూ ఉండనే ఉంది.. జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘మీ కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి ఏమైనా చెబుతారా’? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. ఆ మధ్యన కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే పరిస్థితి ఏంటి?? ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్ గారికి కరోనా వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే’ అంటూ తేల్చిచెప్పారు పవన్ కళ్యాణ్. ఈ లెక్కన కరోనాకి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మరో ఆర్నెళ్లు ఈ వ్యాక్సిన్ కోసం సమయం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక వచ్చే ఏడాదిలోనే పవన్ సినిమాపై ఆశలు పెట్టుకోవాలి. ప్రస్తుతం ఆయన వకీల్ సాబ్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాకి ఓకే చెప్పారు. ఈ రెండు సెట్స్‌పై ఉండగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో మూడో సినిమా లైన్‌లో ఉంది. వీటిని త్వరిత గతిన పూర్తి చేసి 2024 ఎన్నికలకు సన్నద్దం కావడం పవన్ కళ్యాణ్‌కి టఫ్ ఫైట్‌గా మారింది. ఇలాంటి తరుణంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3f06LfM

No comments:

Post a Comment

Will Hathiram Be Killed In Paatal Lok?

'I insisted only Jaideep could play Inspector Haathiram Chaudhary.' from rediff Top Interviews https://ift.tt/RHLTIwD