Saturday, 25 July 2020

యంగ్ హీరో నాగశౌర్య ఇంతలా మారిపోయాడేంటి? షాకింగ్ లుక్ రిలీజ్..

లవర్ బోయ్‌గా కెరీర్‌ను ప్రారంభించిన .. కమర్షియల్ చిత్రాలతో పాటు, కంటెంట్ ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాను సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ ప్రీ లుక్‌లో నాగశౌర్య బాడీని వెనుక నుంచి చూపిస్తూ ఆసక్తి రేకెత్తించారు. ఈ పోస్టర్‌లో కండలు తిరిగిన దేహంతో కనిపించిన ఆయనను చూసి ఆశ్చర్యపోతున్నారంతా. వావ్! నాగశౌర్య ఇంతలా మారిపోయాడేంటి? అని షాక్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ జులై 27వ తేదీ సోమవారం విడుదల చేయనున్నట్లు ఈ పోస్టర్ ద్వారా తెలిపారు. Also Read: ప్రాచీన క్రీడా నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోందని టాక్. నాగశౌర్య కెరీర్‌లో 20వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. అతిత్వరలో చిత్రానికి సంబంధించిన నటీనటుల పూర్తి వివరాలు అతి త్వరలో ప్రకటించనుంది చిత్రయూనిట్. నాగశౌర్య గత చిత్రం 'అశ్వథ్థామ' కోసం కూడా ఆయన భారీగానే కష్టపడ్డాడు. కండలు పెంచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కానీ సినిమా మాత్రం మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. చూడాలి మరి ఈ సినిమా అయినా ఆయన కష్టానికి తగిన ఫలితాన్నిచ్చి సంతృప్తి ఇస్తుందా? లేదా? అనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39DBuyl

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....