Sunday, 5 July 2020

పవన్ కళ్యాణ్ బయోపిక్... ఫుల్ క్లారిటీ ఇచ్చిన వర్మ

ప్రముఖ టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరో ట్వీట్ వదిలాడు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరిటి సినిమా తీస్తానంటూ ప్రచారం చేశాడు వర్మ.. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో మరో కామెంట్ చేశాడు. 'నేను తీస్తోన్న పవర్‌ స్టార్‌ సినిమా ఏ వ్యక్తికో చెందిన బయోపిక్ కాదు. పార్టీ ప్రారంభించి, ఎన్నికల్లో ఓడిన ఓ టాప్‌ సినీ స్టార్.. అనంతర పరిణామాల గురించి కల్పిత కథతో ఈ సినిమా రూపుద్దికుంటోంది. ఏ వ్యక్తి జీవితాన్నైనా ఈ కథ పోలి ఉంటే అది కేవలం అది యాదృచ్ఛికం మాత్రమే' అని చెప్పారు. పవర్ స్టార్‌ అనే సినిమా పవన్ కల్యాణ్‌ బయోపిక్‌ అంటూ మీడియాలో వస్తోన్న ఊహాగానాలు బాధ్యతారాహితం, వాటిల్లో నిజాలు లేవని ఆయన ట్వీట్లు చేశారు. ఇదంతా మీడియా సృష్టే అంటూ పవన్ బయోపిక్ వార్తల్ని వర్మ కొట్టి పారేశాడు. గతంలో వర్మ పీకే సినిమా తీస్తానంటూ ఓ వీడియో కూడా షేర్ చేశాడు. అందులో అచ్చం పవన్ కళ్యాణ్‌ గెటప్‌లో ఉండే వ్యక్తి పవర్ స్టార్ స్టైల్లో నడుచుకుంటూ వస్తున్న వీడియోను షేర్ చేశాడు. దీంతో అంతా పవన్‌పై వర్మ సినిమా తీస్తున్నాడని చెప్పుకున్నారు. అయితే ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌ ఉంటారని ఆయన చెప్పారు. ఆ పదాలకు అర్థం చెబుతూ మెగాస్టార్‌, నాగబాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ అనే ఇప్పటికే అందరూ గుర్తించారు. అయితే, ఇది పవన్ కల్యాణ్ బయోపిక్ కాదని వర్మ వివరణ ఇచ్చారు. అయితే వర్మ తాజాగా చేసిన ట్వీట్ పై పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు బాగానే స్పందిస్తూన్నారు. వర్మ మీరు సినిమా తీయండి మేం దాన్ని 100 రోజులు ఆడేలా చేస్తామంటూ కొందరు నెటిజన్స్ స్పందిస్తున్నారు. ఇంకొందరు మాత్రం వర్మపైనే సెటైర్లు వేస్తారు. వర్మ చెప్పేదొకటి చేసేదొకటి ఉంటుందన్నారు. రియాల్టీకి.. వర్మ సినిమా టీజర్లకు చాలా తేడా ఉంటుందని ఆడుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38sKGEZ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....