తెలుగు సినీ పరిశ్రమలోని మూడు తరాలతో పనిచేసిన చాలా తక్కువ మంది దర్శకుల్లో కె.రాఘవేంద్రరావు ఒకరు. 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకు ఎంతో మంది స్టార్ హీరోలతో ఆయన పనిచేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించారు. వాటిలో ‘వేటగాడు’, ‘వజ్రాయుధం’ కూడా ఉన్నాయి. ఎన్టీ రామారావు హీరోగా, శ్రీదేవి హీరోయిన్‌గా రాఘవేంద్రరావు దర్శకత్వంతో రూపొందిన ‘వేటగాడు’ చిత్రం 1979 జూలై 5న విడుదలైంది. అలాగే, నటశేఖర కృష్ణ, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘వజ్రాయుధం’ సినిమా 1985 జూలై 5న రిలీజ్ అయ్యింది. అంటే, వేర్వేరు సంవత్సరాల్లో ఒకేరోజు విడుదలైన ఈ రెండు సినిమాలకు దర్శకుడు ఒకరే కావడం విశేషం. అందుకే రాఘవేంద్రరావుకు ఈరోజు ఒక మధుర జ్ఞాపకం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. Also Read: ‘‘నా కెరీర్‌లో ఈరోజు రెండు మధుర జ్ఞాపకాలున్నాయి. నేను దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమాలు ‘వేటగాడు’, ‘వజ్రాయుధం’ వరుసగా 41 ఏళ్లు, 35 ఏళ్లు పూర్తిచేసుకున్నాయి. ఇలాంటి జ్ఞాపకాలను నాకు మిగిల్చిన అన్న ఎన్టీఆర్ గారికి, కృష్ణకి ధన్యవాదాలు. ఈ రెండు సినిమాల్లోనూ నా దేవత శ్రీదేవి నటించడం అద్భుతం’’ అని రాఘవేంద్రరావు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ రెండు సినిమాలకు సంబంధించి అప్పటి పోస్టర్లను కూడా అభిమానులతో పంచుకున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gyKC9H
No comments:
Post a Comment