Sunday, 5 July 2020

శ్రీదేవి ఫేక్ పోస్టుమార్టం రిపోర్ట్ వైరల్.. అసలేం జరిగిందంటే..

ప్రముఖ నటి చెందిన విషయం అందరికీ తెలిసిందే. సినీ ప్రేక్షకులందర్నీ ఈ వార్త తీవ్ర మనోవేదనకు గురి చేసింది. అయితే ఆమె మృతి ఓ మిస్టరీగా మిగిలింది. బాత్ టబ్‌లో ఆమె పడి చనిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. బాలీవుడ్ నటుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు శ్రీదేవి కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లారని చెప్పింది. అక్కడ హోటల్‌లో బస చేసిన ఆమె అనుమానాస్పదంగా బాత్ రూం టబ్‌లో చనిపోయి ఉంది. ఫిబ్రవరి 24, 2018న ఈ దుర్ఘటన చోటు చేసుకుంది అపస్మారక స్థితిలో పడిపోవడంతో ఊపిరి ఆడక మరణించింది. అయితే, ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఓ డెత్ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అతిలోక సుందరి శ్రేదేవి మరణం సహజంగా జరగలేదని, ఆమె కొకైన్, ఆల్కహాల్ తీసుకోవడంతో పాటుగా చేతిపై గాట్లు ఉన్నాయని చెప్పి ఆ పోసటు మార్టం రిపోర్ట్ లో ఉన్నది. దుబాయ్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ గా దీనిపై ఉండటంతో సంచలనంగా మారింది. పైగా దీనిని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా తన సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ రిపోర్ట్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ రిపోర్ట్ ఫేక్ రిపోర్ట్ అని కొన్ని మీడియా సంస్థలు నిర్ధారించాయి. శ్రీదేవి మరణానికి సంబంధించిన ఒరిజినల్ రిపోర్ట్స్ ను కొన్ని మీడియా సంస్థలు సేకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి. అపస్మారక స్థితిలో ఆమె బాత్ టబ్ లో పడిపోవడం వలన మరణించినట్టు ఆ రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. అంతేకాదు, కంగనాకు సోషల్ మీడియా లేదు. ఆమె ట్విట్టర్, ఫేస్ బుక్ వంటివి హ్యాండిల్ చేయడం లేదు. దీంతో కంగనా పోస్ట్ చేసినట్టుగా వచ్చిన న్యూస్ ఫేక్ అని, ఎవరో కావాలనే ఇలా ఫేక్ క్రియేట్ చేసి ఉంటారని సినీ విశ్లేషకులు ఇకపోతే చనిపోయే నాటికి శ్రీదేవి వయసు 54 సంవత్సరాలు. 1963 ఆగస్టు 13న తమిళనాడులో ఆమె జన్మించారు. 1967లో నాలుగేళ్ల వయసులో ఒక తమిళ సినిమాతో బాలనటిగా సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆతర్వాత కూడా తెలుగు, మలయాళం సినిమాల్లోనూ బాలనటిగా కనిపించారు. 1979లో శ్రీదేవి బాలీవుడ్ హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. హిందీలో కథానాయికగా 'సోల్‌వా సావన్' ఆమె మొదటి చిత్రం. 1996లో సినీ నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లి చేసుకొన్నారు. శ్రీదేవి, బోనీకపూర్‌లకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీదేవి నటించిన 300వ చిత్రం 'మామ్' 2017లో విడుదల అయ్యింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2BxQKAa

No comments:

Post a Comment

'We Know How To Protect Our Religion'

'If someone fiddles us on our religion then we will pay back five times more to that person. We have proved that time and again.' ...