Sunday, 5 July 2020

దారిచూపిన వర్మ: త్వరలో భీమవరం టాకీస్ ఏటీటీ ప్రారంభం.. టిక్కెట్ ధర రూ.59

కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. దీంతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. మళ్లీ థియేలర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. దీంతో సినీ ప్రేమికులు ఓటీటీ బాటపట్టారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలలో విడుదలవుతోన్న సినిమాలను ఆస్వాదిస్తున్నారు. అయితే, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త ప్లాట్‌ఫాంకు శ్రీకారం చుట్టారు. అదే ఏటీటీ. ఏటీటీ అంటే ఎనీ టైం థియేటర్ అని అంటున్నారు. ఓటీటీకి దీనికి కాస్త తేడా ఉంది. ఒక ఓటీటీ ప్లాట్‌ఫాంను నెల లేదంటే ఏడాదికి సబ్‌స్ర్కైబ్ చేసుకుంటే అందులో వీడియో కంటెంట్ మొత్తాన్ని వీక్షించొచ్చు. అయితే, ఏటీటీ అలా కాదు. ఒక్క సినిమాకు ఇంత అని చెల్లించాలి. అంటే, ‘క్లైమాక్స్’కు రూ.100, ‘నగ్నం’కు రూ.200 చెల్లించినట్టు అన్నమాట. శ్రేయాస్ ఈటీ సంస్థతో కలిసి ఈ రెండు సినిమాలతో వర్మ మంచి బిజినెస్ చేశారు. అందుకే, ఇప్పుడు మరో నిర్మాత ఈ ఏటీటీ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నారు. Also Read: ‘’ పేరిట ఏటీటీ ప్లాట్‌ఫాం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నిర్మాత రామసత్యనారాయణ ఈ ‘భీమవరం టాకీస్’ను ప్రారంభిస్తున్నారు. కరోనా కారణంగా థియేటర్లలో విడుదలకు నోచుకోని సినిమాలను ఈ ఏటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేయబోతున్నారట. ‘‘సుమారుగా డిసెంబర్ వరకు థియేటర్స్ తెరుచుకోవు. ఒకవేళ తెరుచుకున్నా చిన్న బడ్జెట్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకి రాకపోవచ్చు. అందుకే, రామ్ గోపాల్ వర్మ ద్వారా పుట్టిన ఈ ఐడియాను అమలు పరుస్తున్నాను’’ అని రామసత్యనారాయణ చెప్పారు. ఈ భీమవరం టాకీస్ ఏటీటీ ద్వారా మొదటిగా ‘అమ్మడు కుమ్ముడు’ సినిమాను విడుదల చేయబోతున్నారు. దీని తరవాత సస్పెన్స్ థ్రిల్లర్ ‘స్పాట్’, అనంతరం ‘అగ్లీ’, ‘శివ 143’, ‘ది గ్రేట్ గ్యాంబ్లర్’ ఇంకా పలు సినిమాలు విడుదల కానున్నాయి. దాదాపు 90కి పైగా కొత్త సినిమాలు ఈ ఏటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయట. టికెట్ ధర 59 రూపాయలు. ఒకే టికెట్‌పై కుటుంబం అంతా చూడొచ్చు అని నిర్మాత చెబుతున్నారు. ప్రతి వారం రెండు సినిమాలు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు రామసత్యనారాయణ తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZDaN8e

No comments:

Post a Comment

'We Know How To Protect Our Religion'

'If someone fiddles us on our religion then we will pay back five times more to that person. We have proved that time and again.' ...