‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో సువర్ణ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఫిదా చేసిన నటి ఐశ్వర్యా రాజేష్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ.. సువర్ణ పాత్రకు మాత్రం నూరు మార్కులు పడ్డాయి. అయితే ఐశ్వర్య రాజేష్ గురించి ఓ చర్చ హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆమె పెళ్లైపోయిందనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఐశ్వర్య తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో పాపిటిపై కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మన భారతీయ సంప్రదాయంలో పెళ్లైనవారే పాపిట కుంకుమ పెట్టుకుంటారు. దాంతో చాలా మంది నెటిజన్లు ఐశ్వర్య ఫొటోను చూసి షాకయ్యారు. రహస్యంగా పెళ్లి చేసుకున్నావా? ఏందే సువర్ణ పెళ్లైనట్లు చెప్పేలేనేదే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దాంతో మౌనంగా ఉంటే ఈ రూమర్స్‌కి అడ్డు అదుపు ఉండదని తెలిసిందేగా. అందుకే ఆ మరుసటి రోజే ఐశ్వర్య మరో ఫొటో పోస్ట్ చేస్తూ.. ‘సింగిల్ అండ్ హ్యాపీ’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య తమిళంలో ఓ సినిమాతో బిజీగా ఉంది. ‘కా పే రణసింగం’ అనే సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా నటిస్తున్నారు. విరుమండి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరికీ తెలుగులోనూ క్రేజ్ ఉంది కాబట్టి తమిళంతో పాటు ఇక్కడ కూడా సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. READ ALSO: ఐశ్వర్య ‘కౌసల్య కృష్ణమూర్తి’ అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇందులో ఆమె క్రికెటర్ పాత్రలో నటించారు. ఆ తర్వాత ‘మిస్ మ్యాచ్’ అనే సినిమాలోనూ నటించింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఐశ్వర్య నటించిన మూడో తెలుగు సినిమా. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ సువర్ణగా ఐశ్వర్య నటించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సినిమా హిట్టా ఫ్లాపా అని పట్టించుకోకుండా కేవలం ఐశ్వర్య నటన చూస్తే మాత్రం ఆమెకు తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VCYc4n
No comments:
Post a Comment