మెగాస్టార్ చిరంజీవిని ఏమైనా అంటే చంపేస్తాం అంటూ స్టేజ్‌పైనే ఏడ్చేసారు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ. ఆయన కుమారుడు విశ్వంత్ ‘ఓ పిట్ట కథ’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిరుపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘నా కొడుకు సినిమా వస్తోంది అనగానే ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వచ్చి సాయం చేసారు. ఫస్ట్‌లుక్, ట్రైలర్ లాంచ్, సాంగ్ లాంచ్‌కి చాలా మంది గెస్ట్‌లుగా వచ్చారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చిన హైప్ బాగానే ఉంది. కానీ ఒక్క ఈవెంట్ మిగిలిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇప్పటివరకు వచ్చిన హైప్‌తో సినిమా గురించి అందరికీ తెలిసింది కానీ చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నవారికి కూడా తెలియాలి. అప్పుడేం చేయాలి. మొన్న నాని నిర్మించిన సినిమాకు స్టార్ హీరోలు వచ్చారు. అతను స్టార్ కాబట్టి వచ్చారు. మరి నేను చిన్న నటుడ్ని. నాకు ఎవ్వరు వస్తారు? ఇంకెవరు నా దేవుడు చిరంజీవి అన్నయ్య' READ ALSO: 'ఆయన రెస్ట్ తీసుకుంటున్నప్పుడు నేను వెళ్లి కాళ్లు పట్టుకుని రమ్మంటే ఓ అర్థముంటుంది. కానీ ఆయన షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. అయినా కూడా వెళ్లాను. అప్పటికే అన్నయ్య మూడు ఈవెంట్స్ పూర్తి చేసుకుని ఉన్నారు. ఇలాంటి సమయంలో నా కొడుకు కోసం రండి అన్నయ్యా అని అడగాలంటే బాధ అనిపించింది. అన్నయ్య హ్యాండ్ బాగుంది కాబట్టే మా సినిమా హిట్ అయిపోతుంది. మొన్న ‘అర్జున్ సురవరం’ అనే సినిమాకు ఎన్నో అవాంతరాలు వచ్చాయి. ఆగిపోతుంది అనుకున్న సినిమాకు అన్నయ్య వచ్చారు కాబట్టే అది హిట్ అయింది. ఇప్పుడు హీరో నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు' ' అన్నయ్య ఇంట్లో చాలా మంది హీరోలు ఉన్నారు. వారందరికీ అన్నయ్య చెట్టులాంటివారు. ఈ చెట్టు వారికే కాదు నాలాంటి చిన్నవాళ్లకు కూడా నీడనిస్తుంది. ఓసారి అన్నయ్య నాతో ఓ మాటన్నారు. మీరు బాగుంటే నేను పట్టించుకోను రా. కానీ మీకు ఏదైనా సమస్య వస్తే నేనుంటాను అని. అలాంటి అన్నయ్య పట్టుకుని ఎవరైనా ఏమన్నా అంటే మేం చంపేస్తాం’ అంటూ స్టేజ్ మీదే ఏడ్చేసారు బ్రహ్మాజీ. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32FHkeV
No comments:
Post a Comment