అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఆల్బమ్ నుంచి మొదటి పాటను విడుదల చేశారు. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ‘‘గీత గోవిందం’’ చిత్రంలో ‘‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’’ పాటతో సిద్ శ్రీరామ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ పాటను కూడా గోపీ సుందర్ స్వరపరిచారు. అలాగే, ఆ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పైనే నిర్మించారు. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్‌లో సాంగ్‌ని అందించి మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. ‘‘మనసా.. మనసా.. మనసారా బ్రతిమాలా తనవలలో పడబోకే మనసా’’ అంటూ సాగే ఈ సాంగ్ చాలా బాగుంది. ఇది కూడా మరో సెన్సేషన్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ పాటకు సురేంద్ర కృష్ణ సాహిత్యం అందించారు. Also Read: కాగా, ప్రస్తుతం హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ముఖ్య తారాగణంతో పాటు అఖిల్, పూజా హగ్డే ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు, హీరో అఖిల్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు. ఆయన హీరోలా లాంచ్ అయ్యి సుమారుగా ఐదేళ్లు అవుతున్నా ఇంకా సరైన మార్కెట్‌ను సంపాదించలేకపోయారు. తొలి సినిమా ‘అఖిల్’ డిజాస్టర్ అయ్యింది. ఆ తరవాత వచ్చిన ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కోసం ఈ అక్కినేని హీరో బాగా కష్టపడుతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VBsRPv
No comments:
Post a Comment