ప్రముఖ తమిళ నటుడు జిమ్ బాటపట్టాడు. ఇటీవల తన కొత్త సినిమా కోసం కండలు పెంచానంటూ షాకింగ్ లుక్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్య బాడీ చూసి చాలా మంది అబ్బాయిలు మాకూ ఇలాంటి దేహం ఉంటే ఎంత బాగుండో అంటూ తెగ ట్వీట్లు పెట్టారు. అయితే తన భర్త రోజూ జిమ్‌లో కష్టపడుతుంటే చూడలేకపోతున్నానని అంటోంది ఆర్య సతీమణి సాయేషా సైగల్. ఆర్య జిమ్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘నా భర్తను ఇలా చూసి బాధతో తట్టుకోలేకపోతున్నా. ఆయన్ని చూసి గర్విస్తున్నాను’ అని కామెంట్ చేసింది. పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ‘సాల్పె్ట్టా’ అనే సినిమాలో ఆర్య నటిస్తున్నారు. ఇందులో ఆయన బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. అందుకే వీలనైంతగా కండలు పెంచే పనిలో ఉన్నారు ఆర్య. దీంతో పాటు ఆర్య ‘టెడ్డీ’ అనే మరో సినిమాలో నటిస్తున్నారు. శక్తి సౌందరరాజన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆర్య, సాయేషా మరోసారి జంటగా నటించారు. READ ALSO: ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వేసవిలో విడుదల కాబోతోంది. సాయేషా తెలుగులో ‘అఖిల్’ అనే సినిమాతో పరిచయం అయింది. అక్కినేని వారసుడు అఖిల్‌కు కూడా ఇది తొలి సినిమానే. కానీ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత సాయేషా తమిళంకు వెళ్లిపోయింది. అక్కడ ఆమెకు మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆర్యతో కలిసి చాలా సినిమాల్లో నటించింది. అలా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడంతో ఇరు వైపు కుటుంబాలతో చర్చించి గతేడాది వివాహబంధంతో ఒక్కటయ్యారు. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32M6RTW
No comments:
Post a Comment