Sunday, 1 September 2019

ఇప్పుడు ఆ సినిమా వచ్చుంటే ప్రభాస్ క్రేజ్ పీక్స్‌కి వెళ్ళేదేమో..!

‘బాహుబలి’ తరువాత భారీతనంతో పాటు కథాబలం ఉండాలి అని ‘సాహో’ సినిమాను సెలెక్ట్ చేసుకున్నారు . ఎప్పటిలానే ఈ సినిమాలో కూడా మ్యాన్లీ‌లుక్స్‌తో అదరగొట్టారు. అయితే యాక్షన్ ఎక్కువవడం, కథ తక్కువ కావడం, తక్కువగా ఉన్న ఆ కథ కూడా అసలు అర్థం కాకపోవడం వంటి కారణాలు ‘సాహో’ను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వకుండా అడ్డుపడ్డాయి అనేది ఇండస్ట్రీ అనాలిసిస్. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సాహో అదరగొట్టేస్తుంది. సినిమా టాక్‌కి సంబధం లేకుండా హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ హంగామా ఎన్ని రోజులు నడుస్తుంది అనేది చెప్పడం కష్టం. ఇదిలా ఉంటే, ‘బాహుబలి’ తరువాత ‘సాహో’ కాకుండా గతంలో ప్రభాస్ నటించిన ‘బిల్లా’ సినిమా వచ్చుంటే బావుండేది అనేది చాలామంది రెబల్ స్టార్ ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్న మాట. ఆ సినిమాలో ప్రభాస్ స్టైలిష్ లుక్స్, బిల్డ్ అప్ షాట్స్ అన్నీ టాప్‌క్లాస్‌లో ఉంటాయి. కథ కాస్త నత్తనడకన నడవడం వల్ల ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఆ సినిమా ఈ టైంకి పర్ఫెక్ట్ మెటీరియల్. అప్పట్లో రూ. 50 కోట్లు అంటేనే హై బడ్జెట్. పైగా తెలుగు సినిమా మార్కెటింగ్ సోర్స్ కూడా చాలా లిమిటెడ్‌గా ఉండేది. Also Read: కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. పైగా ప్రభాస్ రేంజ్ కొన్ని రెట్లు పెరిగింది. కాబట్టి ఇప్పుడు కనీసం రూ. 150 కోట్ల బడ్జెట్‌తో, డబుల్ రిచ్‌నెస్‌తో ‘బిల్లా’ తెరకెక్కించి ఉన్నా కూడా మళ్ళీ ఇండియా అంతా ప్రభాస్ పేరు మార్మోగిపోయేది. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయిపోయేవారు. ప్రస్తుతం ‘సాహో’ విషయంలో డైరెక్షన్ ఫాల్ట్, కథ బాలేదు, స్క్రీన్‌‌ప్లే కంఫ్యూసింగ్‌గా ఉంది అంటున్నారు తప్ప.. ప్రభాస్‌కి ఎక్కడా నెగెటివ్ మార్కింగ్ ఇవ్వట్లేదు. కానీ కొంతమంది తెలుగువాళ్ళే ప్రభాస్ లుక్, యాక్టింగ్ గురించి నెగెటివ్‌గా మాట్లాడుతుండడం విశేషం. ఇప్పటికయినా మించిపోయింది లేదు, ‘సాహో’ ఏదో రకంగా గట్టెక్కేలా ఉంది కాబట్టి నెక్స్ట్ యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణా మూవీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అయినా కాస్త బడ్జెట్ కంట్రోల్‌లో ఉంచుకుని తెరకెక్కిస్తే డార్లింగ్‌కి మరో భారీ హిట్ దక్కడం ఖాయం. అయితే ఆ సినిమాలో వీఎఫ్ఎక్స్ అవసరం పెద్దగా లేదు. ఫారెన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ. ప్రభాస్ స్టైలిష్‌నెస్, కామెడీ టైమింగ్ అన్నిటికి స్కోప్ ఉన్న సినిమా. కాబట్టి.. ఇక ‘సాహో’పై మాట్లాడటం మానేసి ఆ సినిమా దగ్గరకు వెళ్లిపోతే సరి..!


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NKV3eU

No comments:

Post a Comment

Why Soha Stayed Away From Movies For 7 Yrs

'It's been seven years since I did a movie. Now, I'm back.' from rediff Top Interviews https://ift.tt/zonRxlq