శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్‌లను పరిచయం చేస్తూ తెరకెక్కుతోన్న చిత్రం ‘జై సేన’. సీనియర్ దర్శకుడు వి.సముద్ర దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్‌ప్లే కూడా ఈయనే అందించారు. వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన సునీల్ టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలోని ‘మా స్టూడెంట్స్ పవరేంటో తెలిపేదే సేన’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్, టైటిల్ సాంగ్‌ను మెగా బ్రదర్ నాగబాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి.సముద్ర, కో-ప్రొడ్యూసర్ శిరీష్‌రెడ్డి, హీరోలు శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్ పాల్గొన్నారు. ‘జై సేన’ సాంగ్‌ను విడుదల చేసిన అనంతరం నాగబాబు మాట్లాడుతూ.. ‘యంగ్‌స్టర్స్ ఈ సినిమాలో మంచి పాత్రలు పోషించారు. శ్రీకాంత్, సునీల్ ప్రముఖ క్యారెక్టర్స్ చేశారు. సాంగ్ చూసినపుడు యూత్ అండ్ పొలిటికల్ మూవీ అనిపించింది. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ, ఈ సినిమాకి దర్శకత్వం వహించి నిర్మిస్తున్న సముద్రగారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. కాగా, ఈ పాట చూస్తుంటే పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’ స్ఫూర్తితో సినిమా తీసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. పవర్ స్టార్‌ను గుర్తుచేసేలా ఎర్రతుండు కూడా వాడారు. ఈ సాంగ్ టీజర్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్ రేపు (సెప్టెంబర్ 2న) పుట్టినరోజు జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే ఈ పాటను విడుదల చేశారు. పవన్ ఇమేజ్‌ను వాడుకొని సినిమాను క్యాష్ చేసుకోవాలని సముద్ర చూస్తున్నారు. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. కాగా, ఈ సినిమాలో అజయ్ ఘోష్, మధు, ఆజాద్, ధన్‌రాజ్, వేణు, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. తిరుమల శెట్టి సుమన్, పార్వతిచందు మాటలు అందించారు. అభినయ్ శ్రీను, సిరాశ్రీ పాటలు రాశారు. రవిశంకర్ సంగీతం సమకూర్చారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మారాజశేఖర్ ఈ సినిమాకు పనిచేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2zFCK2B
No comments:
Post a Comment