Sunday 1 September 2019

‘బందోబస్త్’గా వస్తోన్న సూర్య.. గెట్ రెడీ!

సినిమా సినిమాకి నటనలోనూ, ఆహార్యంలోనూ వైవిధ్యం కనబరిచే కథానాయకుల్లో ఒకరు. ‘గజిని’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, ‘సింగం’, ‘24’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. సూర్య హీరోగా నటించిన తాజా సినిమా ‘బందోబస్త్’. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘రంగం’ ఫేమ్ కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించారు. తెలుగు ప్రేక్షకులకు ‘నవాబ్’, ‘2.0’ చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ్యారీస్ జైరాజ్ సంగీత సమకూర్చారు. ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను సెప్టెంబర్ రెండో వారంలో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన దేశభక్తి గీతం ‘ఎన్నో తారల సంగమం.. అంబరం ఒకటే..’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే, ‘చెరుకు ముక్కలాంటి..’ పాట మాస్ ప్రేక్షకులను మెప్పించింది. కమాండోగా, రైతుగా సూర్య గెటప్పులు ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఆల్రెడీ విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్ యూట్యూబ్, సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. పాకిస్తాన్‌ తీరును ఎండగడుతూ మోహ‌న్‌లాల్‌ చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌, సూర్య నటన సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. దీంతో, విడుదలకు నెలన్నర ముందే శాటిలైట్ హక్కులు హాట్ కేకులా అమ్ముడయ్యాయి. ఈ సినిమా శాటిలైట్ హక్కులను భారీ రేటుకు ప్రముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్, స‌న్ నెట్‌వ‌ర్క్‌కి చెందిన జెమిని సొంతం చేసుకుంది. ‘బందోబస్త్’ తమిళ వెర్షన్ ‘కాప్పాన్’ పాటలు ఇటీవలే సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదలయ్యాయి. కాగా, సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, కీలక పాత్రలో ఆర్య నటిస్తున్నారు. బోమన్ ఇరానీ, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2zD9M3t

No comments:

Post a Comment

'We Attribute Failure To The Director'

'Our analysis of success, like failure, is so reductive and so one dimensional that we don't look at the bigger picture.' from...