Sunday 1 September 2019

పబ్‌లో పాప్ సాంగ్‌కి సమంత స్టెప్పులు.. ఎంజాయ్ చేసిన నాగచైతన్య

అక్కినేనివారి కోడలు ప్రస్తుతం సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం సమంత, దంపతులు స్పెయిన్‌లోని ఇబిజా ఐల్యాండ్స్‌లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున పుట్టినరోజు వేడుక జరపడానికి అక్కినేని ఫ్యామిలీ అంతా స్పెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంకా వాళ్లంతా అక్కడే ఉన్నారు. Also Read: ఇబిజాలో తాము ఎంజాయ్ చేస్తోన్న క్షణాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సమంత అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సమంత ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేస్తున్నారు. ‘వి విల్ వి విల్ రాక్ యు’ అనే ఫేమస్ పాప్ సాంగ్‌కు పబ్‌లో సమంత తనదైన స్టైల్లో స్పెప్పులేశారు. ఆమెకు ఎదురుగా ఉన్న నాగచైతన్య.. తన సతీమణి స్టెప్పులను ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోతోపాటు ఇబిజా బీచ్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను కూడా సమంత పోస్ట్ చేశారు. శరీరం వెనుక భాగంలో మెడ కింద ‘వై మి’ అని టాటూ వేయించుకుని ఆ ఫొటోను కూడా షేర్ చేశారు. మొత్తం మీద ఇబిజాలో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆ ఎంజాయ్‌మెంట్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు సమంత. సమంత పోస్టుకు రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి లాంటి వారు రిప్లై‌లు ఇచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZslUUn

No comments:

Post a Comment

'We Attribute Failure To The Director'

'Our analysis of success, like failure, is so reductive and so one dimensional that we don't look at the bigger picture.' from...