Tuesday, 17 September 2019

‘వాల్మీకి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. వరుణ్ తేజ్ సేఫ్ గేమ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. అథర్వా మురళి, మృణాళిని రవి, బ్రహ్మాజి, బ్రహ్మానందం, శత్రు తదితరులు నటించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయానక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈనెల 20న ‘వాల్మీకి’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో హరీష్ శంకర్ కొన్ని మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మరోవైపు, వరుణ్ తేజ్ ‘F2’తో మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకున్నారు. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా పక్కా మాస్ మూవీని ఎంపిక చేసుకున్నారు. ఇప్పటి వరకు చూడని లుక్‌లో వరుణ్ కనిపించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. సినీ ప్రేమికులు సైతం వరుణ్ కిరాక్ లుక్ చూసి వహ్వా అన్నారు. ఇక టీజర్, ట్రైలర్, పాటల ప్రోమోలు చూసిన తరవాత ‘వాల్మీకి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ‘వాల్మీకి’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘వాల్మీకి’ థియేట్రికల్ హక్కులను సుమారు రూ.20 కోట్లకు విక్రయించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అయితే సుమారు రూ.25 కోట్ల బిజినెస్ జరిగింది. ప్రస్తుతం వరుణ్ తేజ్‌కు ఉన్న మార్కెట్‌ను బట్టి చూస్తే ఈ రూ.25 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే గనుకు దీనికి మూడింతలు రావడం కూడా ఖాయం. మొత్తం మీద వరుణ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లను అస్సలు రిస్కులో పెట్టకుండా సేఫ్ జోన్‌లో వేస్తున్నారు. ప్రాంతాల వారీగా ‘వాల్మీకి’ థియేట్రికల్ హక్కుల ధరలు
ప్రాంతం బిజినెస్ (కోట్లలో)
నైజాం 7.40
సీడెడ్ 3.35
నెల్లూరు 0.75
కృష్ణా 1.60
గుంటూరు 1.80
విశాఖపట్నం 2.40
తూర్పుగోదావరి 1.60
పశ్చిమగోదావరి 1.10
మొత్తం ఏపీ & టీఎస్ 20.00
దేశంలోని ఇతర ప్రాంతాలు 1.50
ఓవర్సీస్ 3.50
ప్రపంచ వ్యాప్తంగా 25.00


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30uQZSF

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....