Monday, 19 August 2019

వైరల్ వీడియో: ‘ఓన్లీ వన్స్ ఫసక్’ అంటోన్న బన్నీ కూతురు

దిగ్గజ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖకు మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అనతికాలంలోనే ప్రేక్షకులకు ఫేవరెట్ స్టార్ అయిపోయారు. స్టైలిష్ స్టార్‌గా దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. షూటింగులతో ఎప్పుడూ బిజీగా ఉంటే అల్లు అర్జున్.. సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంటారు. ముఖ్యంగా పిల్లలు అయాన్, అర్హలతో ఆడుకుంటుంటారు. తాజాగా కుమార్తె అర్హతో అల్లు అర్జున్ ఆడుకుంటున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఫేమస్ డైలాగ్ ‘ఫసక్’ను అల్లు అర్జున్ తన గారాలపట్టితో చెప్పించారు. అర్హ ఎంతో ముద్దుముద్దుగా ‘ఓన్లీ వన్స్ ఫసక్’ అంటూ దువ్వెనతో తన తండ్రిని సరదాగా బెదిరిస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో..!! అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోను విపరీతంగా ట్వీట్లు చేస్తున్నారు. ‘క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్’ అంటూ తెగ మురిసిపోతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ డ్రామాను చేస్తున్నారు. ‘అల.. వైకుంఠపురములో..’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఖరారు చేశారు. ఇది అల్లు అర్జున్‌కు 19వ సినిమా. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. నివేతా పేతురాజ్, టబు, జయరాం, సుశాంత్‌, మురళీ శర్మ, హర్షవర్థన్, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Z4r08X

No comments:

Post a Comment

'Kejriwal Is Father Of Freebie Culture'

'He didn't implement good policies for good politics.' from rediff Top Interviews https://ift.tt/TP2BJ1d