Tuesday, 20 August 2019

హైదరాబాద్‌లో ‘లెజెండ్స్‌’ లైవ్‌ కాన్సర్ట్‌.. రెహమాన్ టీమ్ వస్తోందన్న ఎస్పీబీ

కె.జె.ఏసుదాస్‌, , కెయస్‌ చిత్ర లాంటి లెజెండరీ సింగర్స్‌‌తో ఎలెవన్‌ పాయింట్‌ టు, బుక్‌ మై షో సంయుక్తంగా ‘లెజెండ్స్‌’ సంగీత కచేరిని నవంబర్‌ 30న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్‌ ఆధ్వర్యంలో జరగునుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం హైదరాబాద్‌లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ చరణ్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘‘తెలుగులో జరుగుతోన్న తొలి సంగీత కచేరి ఇది. నేను, ఏసుదాస్‌, చిత్ర ముగ్గురం ఈ కచేరీలో కేవలం తెలుగు పాటలు మాత్రమే పాడనున్నాం. గతంలో వేరే దేశాల్లో సంగీత కచేరీ చేశాం. కానీ తెలుగులో ఇదే ప్రథమం. ఇంతకు ముందు సింగపూర్‌లో మా అబ్బాయి చరణ్‌, ఎలెవన్‌ పాయింట్‌ టు, బుక్‌ మై షో వారు దీన్ని అద్భుతంగా నిర్వహించారు. ఇక్కడ కూడా అదే విధంగా ఎంతో ప్లాన్డ్‌గా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు’’ అని చెప్పారు. Also Read: కర్ణాటక, తమిళనాడు నుంచి ప్రొఫెషనల్స్‌ అయిన మ్యుజిషియన్స్‌ ఈ లైవ్‌ షోకు మ్యూజిక్‌ బ్యాండ్‌గా వ్యవహరిస్తున్నారని బాలు వెల్లడించారు. అలాగే స్ట్రింగ్స్‌ సెక్షన్‌లో ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన వారు ప్లే చేయనున్నారని తెలిపారు. అలాగే రెహమాన్‌‌కు రైట్‌ హ్యాండ్‌ అయిన శ్రీనివాసమూర్తి కండక్టర్‌గా వ్యవహరించనున్నారని చెప్పారు. ‘‘అన్న ఏసుదాస్‌ గారి పాటతో ప్రారంభమయ్యే ఈ సంగీత కచేరిలో అందరికీ ఇష్టమైన తెలుగు పాటలు పాడనున్నాం. ఇక ఇది కమర్షియల్‌ షో నా? అంటే అవునను చెప్పవచ్చు. ఎంతో వ్యయంతో కూడింది. వ్యాపార ధోరణిలో చేస్తోన్న ఓ అందమైన సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పవచ్చు’’ అని బాలు వివరించారు. ఎస్పీ చరణ్‌ మాట్లాడుతూ.. ‘‘ఏసుదాస్‌ గారు, నాన్నగ రారు, చిత్ర గారు ఇలా ముగ్గురు ఒక వేదికపై ఆలపించడం నాతో పాటు అందరికీ వీనుల విందుగానే ఉంటుంది. ఈ లైవ్‌ కాన్సర్ట్‌ రెగ్యులర్‌గా చేయాలని ఉన్నప్పటికీ ముగ్గురూ చాలా బిజీగా ఉండటంతో వారి టైమ్‌, డేట్స్‌ తీసుకుని చేయడం వలన చాలా గ్యాప్‌ వస్తోంది. ఇక ముందు ముందు కూడా ఇలాగే కొనసాగిస్తాం. ఇప్పటి వరకు మేము చేసిన ‘లెజెండ్స్‌.. ఏ లైవ్‌ కాన్సర్ట్‌’ అంతటా మంచి సక్సెస్‌ అయ్యింది. హైదరాబాద్‌లో నవంబర్‌ 30న గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్‌గా చేస్తున్నాం. ఈ ముగ్గురు లెజెండ్స్‌ ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో వేల పాటలు పాడారు. అందులో కొన్ని పాటలు సెలెక్ట్ చేయడం అంటే కొంచెం ఇబ్బందే. అయినా కూడా శ్రోతలకు బెస్ట్‌ సాంగ్స్‌ అందించే ప్రయత్నం చేస్తాం’’ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2P4vN5G

No comments:

Post a Comment

'Rahul Would Have Been Wiser Had He...'

'...spent 1/10th of his time at 24, Akbar Road...' from rediff Top Interviews https://ift.tt/8rCaHZV