టాలీవుడ్ నుంచి ఈ ఏడాది వస్తోన్న అత్యంత భారీ చిత్రాలు ‘సాహో’, ‘సైరా నరసింహారెడ్డి’. నిజం చెప్పాలంటే ‘సైరా’ కన్నా ‘సాహో’కు జాతీయ స్థాయిలో విపరీతమైన బజ్ ఉంది. ఈ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘సైరా’ కూడా తక్కువేమీ కాదు. ఈ సినిమాను హిందీలో ఫర్హాన్ అక్తర్ లాంటి ప్రముఖ నటుడు విడుదల చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని కూడా తెలుగుతో పాటు ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. అంటే, ఈ రెండు సినిమాలు ఐదు సినీ పరిశ్రమల మార్కెట్‌ను టార్గెట్ చేశాయి. ఇదిలా ఉంటే, ఆదివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకతో ‘సాహో’ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. కనీవినీ ఎరుగని రీతిలో దేశంలో అత్యంత భారీ వేడుకగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే, ఈ వేడుకను మించి ‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ప్లాన్ చేయాలని నిర్మాత చూస్తున్నారట. ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకను స్ఫూర్తిగా తీసుకుని దాని కంటే భారీ స్థాయిలో ‘సైరా’ వేడుకను నిర్వహించాలని చరణ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మెగా ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పోలిస్తే ప్రభాస్ అభిమాన గణం తక్కువనే చెప్పాలి. ‘సాహో’ వేడుకకు సుమారు లక్షమంది అభిమానులు హాజరయ్యారు. అలాంటిది, ‘సాహో’కు మించి ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకను జరిపితే మెగా అభిమానులు ఏ స్థాయిలో హాజరవుతారో ఊహించుకుంటేనే భయమేస్తుంది. అవకాశం ఇవ్వాలి కానీ అభిమానులు ‘మెగా పవర్’ ఏంటో చూపించేస్తారు. వచ్చే నెలలో ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తారని తెలుస్తోంది. తొలుత విజయవాడ లేదా తిరుపతిలో ఈ వేడుకను నిర్వహించాలని అనుకున్నారట. కానీ, ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తరవాత హైదరాబాద్‌లోనే జరపాలని చరణ్ ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఇటీవలే ముంబైకి చెందిన ఈవెంట్ ఆర్గనైజర్స్‌తో చరణ్ సంప్రదింపులు జరిపారట. కొత్త ఐడియాలతో రావాలని వారికి సూచించారని సమాచారం. ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌కు చెందిన శ్రేయాస్ మీడియా నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, ‘సైరా’ టీజర్‌ను నేడు (ఆగస్టు 20న) ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలకానుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZgZsby
No comments:
Post a Comment