హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా అల్కాపురి టౌన్‌షిప్ వద్ద మంగళవారం తెల్లవారుజామున టీఎస్ 09 ఈఎక్స్ 1100 నంబరుతో ఉన్న వోల్వో ఎస్90 లగ్జరీ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ కారు హీరో తరుణ్‌ది అని, ప్రమాదం జరిగిన వెంటనే ఆయన అక్కడి నుంచి పారిపోయారని ప్రచారం జరిగింది. పలు టీవీ ఛానెళ్లలో ఈ వార్తను మంగళవారం ఉదయం ప్రసారం చేశారు. అయితే, తాను ఎలాంటి కారు ప్రమాదానికి గురికాలేదని, అసలు ప్రమాదానికి గురైన కారు తనది కాదంటూ క్లారిటీ ఇచ్చారు . పోలీసులు కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. Also Read: ఈ కారు ప్రమాదంపై విచారణ చేపట్టిన పోలీసులు అల్కాపురి టౌన్‌షిప్ సర్కిల్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. తెల్లవారుజామున చీకట్లో కారులో నుంచి దిగి పారిపోయింది హీరో అని స్థానికులు పోలీసులకు వెల్లడించారు. ఇదే విషయం సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టమైంది. జంక్షన్‌ను దాటుకొని వోల్వో కారు వెళ్లినట్టు సీసీటీవీలో రికార్డయింది. ఆ తరవాత కొంత సేపటికి రాజ్ తరుణ్ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ విజువల్స్ సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. అది చాలా చిన్న సర్కిల్ అని తరుచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాజ్ తరుణ్ కారు సైతం వేగంగా డివైడర్‌ను ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టి ఆ తరవాత రోడ్డు పక్కన గోడను ఢీకొట్టుకుంటూ ఖాళీ స్థలంలో పడిందని వెల్లడించారు. ఇది లగ్జరీ కారు కావడంతో రాజ్ తరుణ్‌కు ఎలాంటి ప్రమాదం కాలేదు. కారు పాక్షికంగా ధ్వంసమైంది. కేసును విచారిస్తోన్న నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్‌ను సంప్రదించడం కోసం ప్రయత్నిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2P3Ljik
No comments:
Post a Comment