Wednesday, 21 August 2019

చెవులు మూసుకుపోయాయి.. కళ్లు కనిపించలేదు: కారు ప్రమాదంపై రాజ్ తరుణ్

హైదరాబాద్‌ శివారు రంగారెడ్డి జిల్లా అల్కాపురి టౌన్‌షిప్ వద్ద సోమవారం అర్ధరాత్రి దాటిన తరవాత జరిగిన కారు ప్రమాదం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టీఎస్ 09 ఈఎక్స్ 1100 నంబరుతో ఉన్న వోల్వో ఎస్90 లగ్జరీ కారు అల్కాపురి టౌన్‌షిప్ సమీపంలో ఉన్న నార్సింగి సర్కిల్ వద్ద రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టి ఖాళీ స్థలంలోకి దూసుకెళ్లింది. ఈ కారు హీరో తరుణ్‌ది అని, ప్రమాదం జరిగిన వెంటనే ఆయన అక్కడి నుంచి పారిపోయారని ప్రచారం జరిగింది. పలు టీవీ ఛానెళ్లలో ఈ వార్తను మంగళవారం ఉదయం ప్రసారం చేశారు. అయితే, ఈ యాక్సిడెంట్ చేసింది మరో హీరో అని తరవాత తెలిసింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాజ్ తరుణ్‌ను గుర్తించారు. యాక్సిడెంట్ చేసింది రాజ్ తరుణ్ అయినప్పటికీ ఆ కారు ఆయన పేరు మీద రిజిస్టర్ అయ్యిలేదు. లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయ్యి ఉందని పోలీసులు తెలిపారు. యజమాని పేరు ప్రదీప్ అని వెల్లడించారు. అయితే, ప్రమాదం జరిగిన తరవాత కారును అక్కడే వదిలిపెట్టి రాజ్ తరుణ్ పారిపోయారు. ఇలా ఎందుకు పారిపోయారో.. ఆయన ఎక్కడ ఉన్నారో అని రాజ్ తరుణ్ అభిమానులతో పాటు పోలీసులు ఆందోళనపడ్డారు. కారు ఓనర్ ప్రదీప్‌ను విచారించారు. మొత్తానికి రాజ్ తరుణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానన్నారు. ‘‘నా గురించి ఆలోచించిన అందరికీ కృతజ్ఞతలు. నేను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇంటి నుంచి కారులో బయటికి వచ్చిన నేను.. మూడు నెలలుగా తరచూ ప్రమాదాలు జరుగుతోన్న నార్సింగ్ సర్కిల్ మీదుగా వెళ్లాను. సర్కిల్ దగ్గర వెంటనే కుడివైపునకు మళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక కంట్రోల్ తప్పాను. రోడ్డు పక్కన ఉన్న గోడను కారు ఢీకొట్టింది. ఆ శబ్ధానికి నా చెవులు మూసుకుపోయాయి. కళ్లు సరిగా కనిపించలేదు. గుండె వేగంగా కొట్టుకుంది. ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థంకాలేదు. అప్పటికి సీటు బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. ఒకసారి నాకు నేను చెక్ చేసుకున్నాను. వెంటనే కారులో నుంచి దిగి ఇంటికి పరిగెత్తాను’’ అని రాజ్ తరుణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి తాను విశ్రాంతి తీసుకుంటున్నానని, కొద్ది రోజుల్లో మళ్లీ షూటింగ్‌కు వెళ్తానని చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Z436dH

No comments:

Post a Comment

'If Pawar Tells Me To Jump In A Well...'

'The reason I am not anxious about the opponent facing me in the front (Ajit Pawar) is because of who is standing behind me like a rock ...