Wednesday, 2 March 2022

Prabhas : ఫ్యాన్స్‌కి హ్యాపీ న్యూస్ చెప్పిన ప్ర‌భాస్‌.. రాజ‌మౌళితో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన డార్లింగ్

త‌మ‌ అభిమాన క‌థానాయ‌కుడిని వెండితెర‌పై చూసి ఇప్ప‌టికే రెండేళ్లు దాటేయ‌డంతో ఎప్పుడెప్పుడా అని ప్ర‌భాస్ ఫ్యాన్స్‌, సినీ ప్రేమికులు ఆతృత‌గా ఎద‌రు చూస్తున్నారు. దానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుంది. మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ‘రాధే శ్యామ్’ విడుదలవుతుంది. బుధ‌వారం ‘రాధే శ్యామ్’ మూవీ రిలీజ్ ట్రైల‌ర్‌ను ముంబైలో విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేసింది. డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందంలో సంబ‌రాలు చేసుకుంటూ ఉన్నారు. ఇదే సంద‌ర్భంలో ప్ర‌భాస్ త‌న ఫ్యాన్స్‌కు మ‌రో గుడ్ న్యూస్ చెప్పారు. ఇంత‌కీ ఏమిటా న్యూస్ అని అనుకుంటున్నారా? పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో సినిమా చేయ‌బోతున్న‌ట్లు డార్లింగ్ ప్ర‌భాస్ చెప్పారు. ముంబైలో జ‌ర్న‌లిస్ట్ మ‌ళ్లీ రాజ‌మౌళితో సినిమా ఎప్పుడు ఉంటుంద‌ని ప్ర‌శ్నించగా దానికి జ‌వాబు ఇస్తూ ప్ర‌భాస్ ‘మళ్లీ నాతో ఎప్పుడు సినిమా చేస్తాడో నాకు తెలియదు. కానీ తప్పకుండా ఆయనతో సినిమా చేయడం ఖాయం. ఆయ‌న నాకు చాలా మంచి మిత్రుడు. సినిమా చేయ‌మ‌ని ఆయ‌న్ని ప్ర‌త్యేకంగా అడగాల్సిన అవ‌స‌రం లేదు. నిజానికి మా ఇద్ద‌రికీ ఓ ప్లాన్ ఉంది. అది ఎప్పుడు వ‌ర్క‌వుట్ అవుతుందో తెలియ‌దు కానీ.. మా కాంబినేష‌న్‌లో సినిమా మాత్రం త‌ప్ప‌కుండా ఉంటుంది’ అన్నారు. బాహుబ‌లితో రేంజ్‌ను టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్‌కు పెంచిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా అంటే ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు పండ‌గే. మ‌రి వీరిద్ద‌రూ వారి వారి సినిమాల క‌మిట్‌మెంట్స్‌తో బిజి బిజీగా ఉన్నారు. వారిద్ద‌రి కాంబినేష‌న్‌లో నెక్ట్స్ మూవీ ఎప్పుడు ఉంటుందో చూడాలి. ఇక బాలీవుడ్ ప్రేక్ష‌కులు త‌న‌ను యాక్ష‌న్ హీరోగా చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తార‌ని అయితే ప్రేక్ష‌కులు బోర్ కొట్ట‌కుండా ఉండాల‌నే ఉద్దేశంతో డిఫ‌రెంట్ సినిమాలను ఎంచుకుంటున్నాను. అందులో భాగంగానే ‘రాధే శ్యామ్’ సినిమా చేశాను అన్నారు డార్లింగ్. పీరియాడిక్ లవ్ స్టోరిగా రూపొందిన ‘రాధే శ్యామ్’లో పూజా హెగ్డే హీరోయిన్. ప్రభాస్ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించబోతున్నారు. ప్రేరణ అనే మ్యూజిక్ స్కూల్ టీచర్ పాత్రలో పూజా హెగ్డే నటించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/1b067vG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....