Friday 11 March 2022

Rajamouli : ఫ్యాన్స్ చేసిన పనికి ఫిదా .. థాంక్స్ చెప్పిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్

మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ RRR. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో రూపొందిన ఫిక్ష‌నల్ పీరియాడిక్ మూవీ ఇది. బాహుబ‌లితో తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి నుంచి వ‌స్తోన్న మ‌రో సినిమా కావ‌డంతో ఎంటైర్ ఇండియానే కాదు.. ప్ర‌పంచంలోని సినీ ప్రేమికులంద‌రూ గురించి ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. మార్చి 25న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఒక వైపు మెగాభిమానులు, మ‌రో వైపు నంద‌మూరి అభిమానులు సినిమా కోసం ఇప్ప‌టి నుంచి హంగామా చేయ‌డం మొదలు పెట్టేశారు. ప్రీ బుకింగ్స్‌లో టికెట్స్‌ను ముందుగానే బ్లాక్ చేసేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది ఫ్యాన్స్ చేస్తున్న కార్య‌క్ర‌మాలు మేక‌ర్స్‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. తాజాగా కెన‌డాలో అభిమానులు కార్ల‌తో RRR అని డిజైన్‌లా త‌యారు చేశారు. అలాగే ఎన్టీఆర్ అని కూడా డిజైన్‌ను కార్ల‌తోనే చేసి యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టి తీసిన RRRలో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. అలాగే బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో పాటు ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా న‌టించారు. చ‌రిత్రలో ఎన్న‌డూ క‌లుసుకోని ఇద్ద‌రు యోధులు క‌లుసుకుని స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంద‌నే క‌థాంశంతో 1920 బ్యాక్‌డ్రాప్‌లో RRRను రూపొందించారు రాజ‌మౌళి. డివివి దాన‌య్య నిర్మాత‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/RmcUulN

No comments:

Post a Comment

'Varun's Citadel Character Is Bambaiya'

'I would think a hundred times before I wrote a gay character or a mentally challenged character because it requires a lot of research a...