Saturday, 12 March 2022

Pawan Kalyan: ‘పీకే’కి కొత్త అర్ధం చెప్పిన పూనమ్ కౌర్.. పవన్‌తో యాక్ట్ చేయనీయలేదంటూ మళ్లీ రాజేసింది

పీకే లవ్స్ అంటూ ఇప్పటికే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. అసలు పవన్ కళ్యాణ్‌తో ఈమెకు ఉన్న రహస్య బంధం ఏంటో తెలియదు కానీ.. తరచూ ఆయన పేరు డైరెక్ట్‌గానో ఇన్ డైరెక్ట్‌గానో ప్రస్తావిస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఇటీవల భీమ్లా నాయర్ రిలీజ్ సందర్భంగా.. ‘అక్కా బావ సినిమా హిట్టు’ అంటూ తనకు పంపిన స్క్రీన్ షాట్స్‌ను సోషల్ మీడియాలో వదిలి మళ్లీ వార్తల్లో నిలిచింది. అనంతరం.. పూనమ్ కౌర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నాతిచరామి’ సినిమా ఈవెంట్‌లో తన పర్సనల్ విషయాలను చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ‘‘ఏ స్త్రీ మీదైనా చిన్న కన్నేసినా వాడు రాక్షసుడే.. కాలం ఏదైనా కథ ఇదే.. సీతాదేవి, ద్రౌపది, దుర్గాదేవిల కథలు చదివాను. వీరంతా కూడా సమాజంలో చాలా ఫైట్ చేసి బిగ్ ఛాలెంజ్‌ను ఎదుర్కొన్నారు.. ఏనాడో పెళ్లి చేసుకుందాం అనుకున్నా.. కానీ పొలిటికల్ సమస్యల వల్ల చెన్నైలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది’ అంటూ తగిలేవాళ్లకి గట్టిగా తగిలేట్టుగానే మాట్లాడింది. పూనమ్ కౌర్. అయితే పూనమ్ కౌర్ ఏది మాట్లాడినా.. ఏది ట్వీటినా.. తిప్పి తిప్పి దగ్గరకో.. తప్పితే త్రివిక్రమ్ దగ్గరకో తీసుకుని వస్తుంటారు కాబట్టి.. రీసెంట్‌గా పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ చర్చలకు దారితీశాయి. తాజాగా ఆమె నటించిన ‘నాతిచరామి’ సినిమా రిలీజ్‌కి రెడీ కావడంతో అందరికీ కాదు కానీ కొన్ని సెలెక్టడ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనమ్ కౌర్ పాల్గొనగా ఇందులో కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావనే తీసుకుని వచ్చాడు ఆ యాంకర్. నిజానికి పూనమ్ కనిపిస్తే.. ఆమె యోగక్షేమాలు కాకుండా.. పవన్ గురించి అడగాలనే ఆత్రమే ఆ యాంకర్‌‌లో కనిపించింది. అంతకు ముందే పీకే లవ్స్ అని అనేసి పెద్దగా నవ్వేసింది పూనమ్ కౌర్. ఓమై గాడ్ అని ఆ యాంకర్ అనగానే.. ‘నాపేరే పూనమ్ కౌర్.. పీ అంటే పూనమ్.. కే అంటూ కౌర్ అని చాలా తెలివిగా పీకేకి అర్ధాన్ని చెప్తూ.. పీకే లవ్స్ అనేసింది. ఇంతలో ఆ యాంకర్.. పవన్ కళ్యాణ్ ఫొటోని స్క్రీన్‌పై చూపించి ఆయన గురించి చెప్పమని అడగ్గానే.. పవన్ ఫొటోని చూస్తూ తెగ సిగ్గుపడిపోయిన పూనమ్ కౌర్.. కాంట్రవర్శీ అనేసి నవ్వడం మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పను.. ఆయనతో యాక్ట్ చేద్దాం అని అనుకున్నా.. కానీ కొంతమంది యాక్ట్ చేయనీయలేదు. ఇప్పుడు ఆయన గురించి ఏమీ చెప్పలేను.. పాజిటివ్‌గా చెప్పినా ప్రాబ్లమ్.. అలాగని నెగిటివ్‌గా చెప్పినా ప్రాబ్లమ్.. అందుకే నేనేం చెప్పను.. అంటూ నాలుక కరుచుకుంటూ.. పవన్ కళ్యాణ్‌ ఫొటోని చూస్తే.. నాకు సిగ్గొచ్చేస్తుందే అని తెగ సిగ్గపడిపోయింది. చివర్లో ఒక్కమాట చెప్తా.. ద్యావుడా.. ఆయనతో అయినంతవరకూ చాలు’ అంటూ దండం పెట్టి తెగనవ్వుకుంది పూనమ్ కౌర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/b0JjNZ6

No comments:

Post a Comment

'Congress Has Many Capable Leaders...'

'Maybe this has created some minor issues which can happen in any party.' from rediff Top Interviews https://ift.tt/lRkZP1O