Wednesday, 2 March 2022

మై లవ్ అంటూ ఫోటో షేర్ చేసిన హీరోయిన్.. రష్మిక మందన పోస్ట్ వైరల్

ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. నేషనల్ వైడ్‌గా రష్మికకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. పుష్ప సినిమాతో రష్మికకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. నేషనల్ క్రష్‌గా రష్మిక మందను డిమాండ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందు. రష్మిక కాస్తా.. క్రష్మిక అయిపోతోంది. హీరోలు సైతం రష్మికను క్రష్మిక అని పిలుస్తున్నారు. మొన్న జరిగిన ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ శర్వానంద్.. రష్మికను ఆట పట్టించేశాడు. రష్మికకు నెట్టింట్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. రష్మిక షేర్ చేసే ఫోటోలు, అభిమానులతో టచ్‌లో ఉండే విధానమే సోషల్ మీడియాలోని క్రేజ్‌కు కారణం. రష్మిక ఆ మధ్య నిత్యం డైరీ లాంటిది మెయింటైన్ చేసేది. రోజంతా చేసిన పనులను క్లుప్తంగా వివరిస్తూ ఓ పోస్ట్ పెట్టేస్తుండేది. అందులో కచ్చితంగా తన పెట్ ఆరా గురించి చెబుతూ ఉంటుంది. ఆరా అనే పెట్‌ను గత ఏడాది తన వద్దకు తెచ్చుకుంది రష్మిక. అది కూడా ఛార్మీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఛార్మీకి పెట్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అయితే రష్మిక కూడా పెట్ లవరే. దీంతో ఆరాతో రష్మిక బంధం రోజురోజుకూ బలపడుతూ వస్తోంది. ఇక రష్మికతో ఆరా చేసే అల్లరి మామూలుగా ఉండదు. రష్మికతోనే బెడ్ షేర్ చేసుకుంటుంది. ఉదయాన్నే రష్మికను నిద్ర లేపుతూ డిస్టర్బ్ చేస్తుంది. ఆరా చేసే అల్లరిని రష్మిక తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా రష్మిక తాజాగా తన పెట్ గురించి చెప్పుకొచ్చింది. ఆరా తన ప్రపంచం అయిపోయిందన్నట్టుగా చెబుతూ ఓ పోస్ట్ చేసింది. మై లవ్ అంటూ చెప్పుకొచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/SkdiZPY

No comments:

Post a Comment

Jaya Bachchan: 'I Really Enjoyed Being Wicked'

''There is not a single day in my life when I don't look at Sweta and Abhishek with pride, for being such fine human beings....