Friday 11 March 2022

Prabhas : బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ప్రభాస్.. ‘రాధే శ్యామ్’ ఫ‌స్ట్ డే కలెక్ష‌న్స్‌

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘రాధే శ్యామ్’. 1970 కాల‌పు యూర‌ప్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ప్రేమ క‌థా చిత్రంగా సినిమాను మూడు వంద‌ల కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌ను పెట్టి నిర్మించారు. ఈ పీరియాడిక్ ల‌వ్ స్టోరీలో ప్ర‌భాస్ జ‌త‌గా పూజా హెగ్డే న‌టించింది. కృష్ణంరాజు గోపీ కృష్ణా మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌సీధ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగానూ భారీ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని ఏడు వేల‌కు పై స్క్రీన్స్‌లో విడుద‌ల చేశారు. దేశ వ్యాప్తంగా చూస్తే ఈ సినిమా రూ.48 కోట్ల‌ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.30 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటు తెలంగాణ ప్ర‌భుత్వం, అటు ఏపీ ప్ర‌భుత్వం టికెట్ రేట్స్‌ను పెంచ‌డంతో ‘రాధే శ్యామ్’కు మంచి వ‌సూళ్లే ద‌క్కాయి. బాలీవుడ్‌లో అయిన తొలి రోజున ఐదు కోట్ల మేర వ‌చ్చాయి. ఇక ఓవ‌ర్ సీస్‌లో చూస్తే.. ఈ సినిమా ప్రీమియర్స్‌తోనే 904 K డాలర్లు వసూలు చేసింది. నార్త్ అమెరికాలో మరికొన్ని స్క్రీన్స్ యాడ్ చేశారు. అక్కడ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విజువ‌ల్ ఫీస్ట్‌గా వ‌చ్చిన పీరియాడిక్ ల‌వ్ స్టోరి ‘రాధే శ్యామ్’లో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడి పాత్ర‌లో క‌నిపించారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత పామిస్ట్ కీరో క్యారెక్ట‌ర్‌ను బేస్ చేసుకుని ప్ర‌భాస్ పాత్ర‌ను డిజైన్ చేశారు. అలాగే పూజా హెగ్డే ప్రేర‌ణ అనే డాక్ట‌ర్ పాత్ర‌లో న‌టించింది. విధికి, ప్రేమ‌కు జ‌రిగిన యుద్ధంలో ప్రేమికులు ఎలా విజ‌యం సాధించారు. ఆ క్ర‌మంలో వారు ఎదుర్కొన్న స‌వాళ్లేంటి? అనేదే ప్ర‌ధాన క‌థాంశం. మ‌నోజ్ ప‌ర‌మ‌హంస సినిమాటోగ్ర‌ఫీ, జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం, త‌మ‌న్ నేప‌థ్య సంగీతం సినిమాకు పిల్ల‌ర్స్‌గా నిలిచాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/rluYMhb

No comments:

Post a Comment

'I Feel I Fail Shah Rukh'

'I'm happy piggybacking on his stardom.' from rediff Top Interviews https://ift.tt/b1euMKc