రెండో వివాహాం తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి చర్చకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. నిశ్చితార్థం విషయం మీడియాకు కాస్త ముందుగానే లీకైంది. మీడియాలో తన రెండో పెళ్లి గురించి వార్తలు వస్తుండటంతో తానే అధికారికంగా ప్రకటించారు. తన భర్త అంటూ గురించి పరిచయం చేశారు. పెళ్లి త్వరలోనే జరుగుతుందని కూడా వివరించారు. అంతే కాకుండా ఈ వివాహాన్ని రెండు కుటుంబాల కలయికగా చూడండని సునీత అందరినీ కోరారు. అలా తన రెండో పెళ్లి గురించి సునీత క్లియర్‌గా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియపరిచారు. కొంత మంది సునీత రెండో పెళ్లి మీద నెగెటివ్ కామెంట్ చేసినా కూడా.. సమాజంలో మెజార్టీ భాగం తమ మద్దతును తెలిపారు. అలా సునీత రెండో పెళ్లి ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే వచ్చింది. పెళ్లి జరిగాక కూడా కొంతమంది నెగెటివ్ కామెంట్లు చేస్తూనే వచ్చారు. కానీ సునీత ఏనాడూ కూడా వాటిని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఈ మధ్య సునీత ఓ నెటిజన్ స్వీట్ వార్నింగ్ లాంటిది ఇచ్చారు. మొత్తానికి ఎంతో కూల్‌గా సమాధానమిస్తూనే గడ్డి పెట్టేశారు. సునీత తమ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు. అందులో తన భర్త, తాను ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోకు ఓ నెటిజన్ తిక్కగా కామెంట్ చేశారు. తన భర్తను తాత, తనను ఆంటీ అంటూ సదరు నెటిజన్ చేసిన కామెంట్ మీద సునీత స్పందించారు. ‘గాడ్ బ్లెస్ యు నాన్న.. బుర్ర మాత్రమే కాదు నువ్వు మనిషిగా కూడా చాలా ఎదగాలి.. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను చూస్తుంటే జాలిగా ఉంది. వారిని దేవుడే కాపాడాలి’ అంటూ గడ్డి పెట్టారు. అయితే సునీత ఇచ్చిన రిప్లైకు నెటిజన్ల మద్దతు లభించింది. అందరూ కూడా ఆ నెటిజన్‌ను తిడుతూ సునీతకు సపోర్ట్ చేశారు. అలా ఎప్పుడూ కూడా సునీతకు సోషల్ మీడియాలో మద్దతు లభిస్తూనే ఉంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hdLbbR
No comments:
Post a Comment