Monday, 26 July 2021

RRR: అదిరిపోయే అప్‌డేట్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ కోసం 'దోస్తీ'.. థీమ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా RRR గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. 'రౌద్రం రణం రుధిరం' పేరిట పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో మెగా పవన్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ హీరోలుగా నటిస్తున్నారు. వెండితెరపై ఈ ఇద్దరి క్యారెక్టర్స్ మెగా, నందమూరి అభిమానులకు కన్నుల పండగ కావాలని స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా భారీ రేంజ్‌లో 'థీమ్ సాంగ్' రూపొందించిన RRR టీమ్, తాజాగా దానికి సంబంధించిన వివరాలు తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ.. ఈ ఐదు భాషల్లో RRR మూవీ రూపొందుతుండటంతో ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ పాటని పాడించినట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. హేమచంద్ర, అనిరుధ్‌ రవిచందర్‌, విజయ్‌ ఏసుదాసు, అమిత్‌ త్రివేది, యాజిన్‌ నైజర్‌ ఆలపించిన ఈ పాటను ఆగస్టు 1వ తేదీన ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. 'దోస్తీ' అంటూ సాగిపోతూ స్నేహం విలువని చాటిచెప్పే ఈ గీతానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాయగా.. కీరవాణి బాణీలు కట్టారు. పాన్‌ ఇండియా మూవీగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రీయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 13న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zDrmRD

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....