Wednesday, 28 July 2021

‘మహాసముద్రం’లో పాత్రలు ఇవే.. త్వరలోనే సినిమా నుంచి మరిన్ని అప్‌డేట్స్

తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’తోనే తన సత్తా నిరూపించుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. , హీరోలుగా ఆయన ‘’ అనే సినిమాని రూపొందిస్తున్నారు. రొటీన్ సినిమాల్లా కాకుండా ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తుంది. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్ది రోజుల క్రితం ఇద్దరు హీరోలతో కూడా పోస్టర్‌ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాలోని అన్ని పాత్రలను పరిచయం చేస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. సినిమాలో ఉన్న ముఖ్యపాత్రలు అన్ని మనం ఈ వీడియోలు చూడొచ్చు. త్వరలో సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని యూనిట్ ప్రకటించింది. అద్భుతమైన ఈ పాత్ర ప్రదర్శనను చూసేందుకు సిద్ధంగా ఉండండి అని అభిమానులకు తెలిపింది. ‘ఫీల్ ది ఇంటెన్సిటీ’ అంటూ చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో అదితిరావ్ హైదరీ- అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తుండగా జగపతిబాబు, రావు రమేష్ లాంటి సీనియర్లు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రామేష్ గూని పాత్రలో నటించడం మరో విశేషం. యువ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఇప్పుటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 19న థియేటర్లలో రిలీజ్ అవుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3C1RNTp

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...