Thursday, 29 July 2021

తిమ్మరుసు ట్విట్టర్ రివ్యూ: సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉందంటే..

వైవిద్యభరితమైన సినిమాలు ఎంచుకుంటూ తనదంటూ ప్రత్యేకమైన దారి అని నిరూపించుకుంటున్నారు యాక్టర్ సత్యదేవ్. సినిమా సినిమాకీ వైవిధ్యం ప్రదర్శించే నటుల్లో ఈయన ఒకరని చెప్పుకోవచ్చు. లీడ్ రోల్ పోషించిన తాజా సినిమా ''. నేడు (జులై 30) ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే యూఎస్ షోస్, ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ఈ సినిమాపై తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. అందులో కొన్ని పరిశీలించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందామా.. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ 'తిమ్మరుసు' సినిమాను క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో వినోదమే ప్రధానమని, ఆ తర్వాత నెమ్మదిగా కథలోకి తీసుకెళ్తామని మూవీ ప్రమోషన్స్‌లో యాక్టర్ సత్యదేవ్ అన్నారు. డిఫరెంట్ మూవీ కాన్సెప్ట్ అని తెలియడం, పైగా కరోనా సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. అయితే 'తిమ్మరుసు' ప్రీమియర్స్ చూసిన జనం చేస్తున్న ట్వీట్లను బట్టి చూస్తే ఈ సినిమా అంచనాలను రీచ్ అయినట్లే తెలుస్తోంది. ఈ చిత్రంలో ట్విస్టులు బాగున్నాయని, అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుందని అంటున్నారు. క్లైమాక్స్ కూడా సినిమాకు ప్లస్ అనే ట్వీట్స్ కనిపిస్తున్నాయి. ఇక యాక్టర్ సత్యదేవ్ నటన అద్భుతం అని చెబుతున్నారు. శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని, యాక్టర్ బ్రహ్మాజీ క్లాస్ కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయని అంటున్నారు. మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనించవచ్చు. మరోవైపు పలువురు సెలబ్రిటీలు ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ ట్వీట్స్ చేశారు. కొద్దిసేపట్లో ఈ సినిమా పూర్తి రివ్యూతో మీ ముందుకు రాబోతోంది 'సమయం తెలుగు'.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lau7WJ

No comments:

Post a Comment

'Acting Is Such A Rich Man's Business Now'

'It's no more just art and skills, it's a business.' from rediff Top Interviews https://ift.tt/rQNK1fd