Saturday, 31 July 2021

పవన్, మహేష్, ప్రభాస్ మధ్య వార్.. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమే! ఇవీ లెక్కలు

సినీ ఇండీస్ట్రీలో బిగ్గెస్ట్ సీజన్ అంటే సంక్రాంతి. ప్రతి ఏడాది సంక్రాంతికి ఎన్నో సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. సంక్రాంతికి తమ సినిమా రిలీజ్ చేస్తే భారీ హిట్ ఖాయం అని కొందరు దర్శకనిర్మాతలు సైతం నమ్మకం పెట్టుకుంటారు. చిన్న, పెద్ద హీరోల సినిమాలతో థియేటర్స్ వద్ద సంక్రాంతి శోభ కనిపిస్తుంటుంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం ఏకంగా ముగ్గురు బడా హీరోలు, అది కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ రంగంలోకి దిగనుండటం జనాల్లో చర్చనీయాంశం అయింది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ ఈ సారి 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపారు డైరెక్టర్ పరశురామ్. జనవరి 13న మూవీ రిలీజ్ ఉంటుందని చెప్పేశారు. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ భారీ సినిమా 'రాధే శ్యామ్' కూడా జనవరి 14న రంగంలోకి దిగుతోంది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. అయితే వీళ్ళతో పోటీగా కూడా సంక్రాంతి బరిలో నిలవబోతున్నారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది. మలయాళీ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరేవేగంగా సాగుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో మేకర్స్ ఓ అంచనాకు వచ్చేశారని సమాచారం. జనవరి 12వ తేదీన విడుదల చేయాలని ఫిక్సయ్యారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో పవన్, మహేష్, ప్రభాస్ మధ్య పోటీ తప్పదని తెలుస్తోంది. మరోవైపు ఈ సంక్రాంతికి ముగ్గురు పెద్ద హీరోలు రంగంలోకి దిగుతుండటంతో ఇన్ని రోజులు వెలవెలబోయిన థియేటర్స్ ఇక కళ సంతరించుకుంటాయని అంతా ఆనందంగా ఉన్నారు. పవన్, మహేష్ఎం ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరికివారు ఈ పోటీలో తమ హీరో అంటే తమ హీరోదే విజయం అని నెట్టింట హంగామా చేస్తున్నారు. సో.. చూడాలి మరి ఏం జరుగుతుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3C3i57p

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....