Friday, 30 July 2021

Kaatuka Kanule రేర్ ఫీట్.. ఇది సమష్టి విజయం

హీరోగా అపర్ణా బాలమురళీ అనే అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ సుధా కొంగర తెరకెక్కించిన చిత్రం (తమిళంలో సూరారై పొట్రూ). ఎన్నో ఏళ్లుగా సరైన విజయం కోసం ఎదురుచూసిన సూర్యకు ఆకాశం నీ హద్దురా ఊపిరినిచ్చింది. అందరి మన్నళలు అందుకోవడమే కాకుండా ఆస్కార్ బరిలో నిలిచింది. ఇక సూర్య నటనను దేశం మొత్తం మరోసారి చూసింది. అలా ఓటీటీలో గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా అంతలా ఆదరణకు నోచుకోవడానికి బోలెడన్నీ కారణాలున్నాయి. అందులో సంగీతం కూడా ఒకటి. ఆ పాటలన్నీ కూడా సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటిని తెరకెక్కించిన విధానం కూడా అంతే ముచ్చటగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అంటూ హీరోయిన్ పాడే పాట, చేసే అల్లరి అందరినీ ఫిదా చేసేసింది. ఆ పాటకు ఇప్పుడు యూట్యూబ్‌లో రేర్ ఫీట్ దక్కింది. వీడియో సాంగ్‌కు వంద మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ పాటను ఇంత అద్భుతంగా రాసిన భాస్కర భట్ల, పాడిన తమిళ సింగర్ ఢీ, సంగీతమందించిన జీవీ ప్రకాశ్, కొరియోగ్రఫీ చేసిన శోభీ, శేఖర్ మాస్టర్ ఇలా అందరూ కలిసి సమష్టిగా కృషి చేయడంతోనే ఆ పాట అందరినీ ఇంతలా ఆకట్టుకోగలిగింది. ఓ సందర్భంలో మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాటల రచయిత భాస్కర్ భట్ల ఈ పాట రాసిన సందర్భాన్ని, అందులోని పదాల వాడుక గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆ పాటకు సంబంధించి భాస్కర భట్ల చెప్పిన విశేషాలు కింద లింకులో చదవొచ్చు. Also Read


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lgGgJW

No comments:

Post a Comment

'Acting Is Such A Rich Man's Business Now'

'It's no more just art and skills, it's a business.' from rediff Top Interviews https://ift.tt/rQNK1fd