
సినిమాకు ఎన్నో బలాలున్నాయి. ఓ వైపు మెలోడి బ్రహ్మా మణిశర్మ సంగీతం.. మరో వైపు కీరవాణి గాత్రం ఇంకో వైపు నటనలో వంకపెట్టలేనటు వంటి సీనియర్ నటి సుహాసిని. ఇలా బలమెవ్వడు సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆ మధ్య వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ నెట్టింట్లో ఎంతగా హల్చల్ చేసిందో అందరికీ తెలిసిందే. కరోనా, మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించినట్టు కనిపిస్తోన్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌లో తళుక్కున మెరిశారు. తెలుగు, తమిళ చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్న సుహసినీ.. చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. "బలమెవ్వడు" సినిమాలో డాక్టర్ యశోద పాత్రలో నటిస్తున్నారు సుహసినీ. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే నిజాయితీ గల వైద్యురాలి పాత్రలో సుహసినీ నటన అద్బుతంగా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్‌ను వదిలారు. దీనికి మణిశర్మ సంగీతం అందించగా.. కీరవాణి పాడారు. కళ్యాణ్ చక్రవర్తి అద్భుతంగా ఈ పాటను రాశారు. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న "బలమెవ్వడు" సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు "బలమెవ్వడు" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3icl1a7
No comments:
Post a Comment