Saturday 31 July 2021

దాన్ని చూసి కఠిన సత్యాలు తెలుసుకోండి.. సుమంత్ వివరణపై ఆర్జీవీ సెటైర్స్

ఈ మధ్య సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు వింత వింత దారులు తొక్కుతున్నారు. పెళ్లి,ఎంగేజ్మెంట్ అనే వాటిని అడ్డం పెట్టుకుని సినిమాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎందుకు వైరల్ అవుతుంది.. అది అలా ఎందకు అవుతోంది? అని ఆలోచనలు ఉండవు. అలా ఆ రూమర్ వైరస్‌లా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. మొన్న అంతా కూడా రెండో పెళ్లి గురించి వార్తలు వైరల్ అయ్యాయి. వెడ్డింగ్ కార్డ్ అంటూ ఒకటి చక్కర్లు కొట్టింది. అందులో వివాహానికి సంబంధించిన వివరాలేవీ లేకపోయినా కూడా సోషల్ మీడియా మొత్తం సుమంత్ రెండో పెళ్లి గురించి చర్చించుకుంది. అలా మొత్తానికి తన రెండో పెళ్లి అంటూ వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. అంతకు ముందే వర్మ ఈ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి అంటే పెద్ద పెంట.. నీకు ఇంకా బుద్ది రాలేదా? మళ్లీ పెళ్లి చేసుకుంటావా? అని సుమంత్‌ని చెడామడా తిట్టేశాడు. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని, ఆ వెడ్డింగ్ కార్డ్ తన తదుపరి సినిమా కాన్సెప్ట్‌కు సంబంధించింది అని చెప్పుకొచ్చారు. పెళ్లి, విడాకుల మీద రాబోతోన్న సినిమా అని అసలు విషయం క్లారిటీగా చెప్పారు. మొత్తానికి వాళ్లే లీక్ చేసి ఇలా తమ సినిమాను జనాల్లో హాట్ టాపిక్ అయ్యేలా చేశారని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. అదెలా ఉన్నా గానీ సుమంత్ ఇచ్చిన వివరణతో కాస్త చల్లబడ్డట్టున్నారు. ఈ విషయం చెప్పినందుకు థ్యాంక్స్ సర్.. ఇదంతా సినిమా కోసమే అని చెప్పినందుకు ఆ దేవుడికి దయ్యానికి థ్యాంక్స్. మళ్లీ మొదలైందది అనే సినిమాను అందరూ చూడండి.. పెళ్లి గురించి కఠిన సత్యాలను తెలుసుకోండి.. పెళ్లి అనేది నరకంలో ప్రమాదవశాత్తు జరిగేదని తెలుసుకోండని వర్మ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jnIXa3

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz