Tuesday, 27 July 2021

Anasuya Bharadwaj: లో- దుస్తులు వేసుకోలేదా అంటూ నటిపై ట్రోల్స్.. ఆ ఫొటో చూపిస్తూ జబర్దస్త్ రియాక్షన్

నానాటికీ విస్తరిస్తూ వస్తున్న సోషల్ మీడియా కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలను ఇబ్బందుల్లో నెట్టేస్తోంది. సామజిక మాధ్యమాల్లో తమకు నచ్చిన కామెంట్స్ చేసే వెసులుబాటు ఉండటంతో కొందరు నెటిజన్స్ హద్దుమీరుతున్నారు. నెగెటివ్ కామెంట్ చేసినా అది ఓ పరిమితి వరకైతే ఓకే కానీ హీరోయిన్లపై నీచంగా మాట్లాడటం ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తున్నాం. రీసెంట్‌గా మరాఠి నటి హేమాంగి కవికి ఇలాంటి దారుణ పరిస్థితే ఎదురైంది. ఆమె డ్రెస్సింగ్ విషయమై నెటిజన్స్ హద్దులు దాటి కామెంట్స్ చేయడంతో ఈ ఇష్యూ వైరల్ అయింది. నటి తన ఇంట్లో చపాతీలు చేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే చపాతీలు చేసే విధానాన్ని చూడటం మానేసిన కొందరు ఆకతాయిలు ఆమె వస్త్రాధారణపై కన్నేశారు. అంతటితో ఆగక ''ఏంటి లో-దుస్తులు ధరించలేదా..?, లోపల నీ బాడీ స్పష్టంగా కనిపిస్తోంది'' అంటూ నీచమైన కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేశారు. దీంతో దీనిపై సదరు నటి ఘాటుగానే రియాక్ట్ అయింది. ''మగవారికి ఉన్నట్టుగానే మాక్కూడా అన్నీ ఉంటాయి. కాళ్లు చేతులు కదులుతుంటే దానికి తగ్గట్టుగానే అవి కూడా కదులుతుంటాయి. అలా కదలని వారు ఎవరైనా ఉంటే నాకు చూపించండి. అయినా ఇంట్లో ఉన్నప్పుడు ఏం ధరించాలో ధరించకూడదో అది నా ఇష్టం'' అంటూ ట్రోలర్స్‌పై ఎటాక్ చేసింది నటి హేమాంగి కవి. అయితే హేమాంగి కవి డేరింగ్, ఆమె ఇచ్చిన ఆ సమాధానం చూసి ఈ ఇష్యూపై ఓ రేంజ్ చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హేమాంగికి పలువురు నటీమణుల సపోర్ట్ లభిస్తోంది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు సినీ తారలు. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ స్పందిస్తూ.. డ్రెస్సింగ్ సెన్స్ అనేది కచ్చితంగా మా ఛాయిస్, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పింది. ఇదే ఇష్యూపై రియాక్ట్ అయిన 'ఎంతో ధైర్యవంతురాలివి నువ్వు.. అదిరిపోయేలా జవాబిచ్చావు' అనే కోణంలో కామెంట్ చేసింది. ట్రోలర్స్‌ని తిప్పికొట్టడంలో ఎప్పుడూ ముందుండే అనసూయ తోటి నటీమణులకు కూడా మద్దతు ఇస్తుండటం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rzH5yy

No comments:

Post a Comment

'Congress Has Many Capable Leaders...'

'Maybe this has created some minor issues which can happen in any party.' from rediff Top Interviews https://ift.tt/lRkZP1O