Sunday, 4 July 2021

ఆమిర్ ఖాన్ విడాకుల వ్యవహారంపై ఆర్జీవీ కామెంట్స్.. పెళ్లి అనేది మూర్ఖత్వం అంటూ సంచలనం

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్పులు సాధారణమే. ఎప్పుడు ఎలాంటి న్యూస్ బయటకొస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. సజావుగా సాగిపోతున్న దాంపత్య జీవితానికి కొన్ని కారణాలతో ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటారు కొందరు సెలబ్రిటీలు. రీసెంట్‌గా తమ పదిహేనేళ్ల దాంపత్య జీవితానికి ఇలాగే ముగింపు పలికారు ఆమిర్‌ఖాన్‌- కిరణ్‌రావు దంపతులు. ఈ మేరకు వాళ్ళు ఇచ్చిన అధికారిక ప్రకటన అందరినీ ఆశ్చర్యపరచడమే గాక బీ టౌన్‌లో హాట్ హాట్ చర్చలకు కారణమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై సంచలన దర్శకుడు రియాక్ట్ అయ్యారు. ఆమిర్‌ఖాన్‌- కిరణ్‌రావు దంపతుల బ్రేకప్ ప్రకటన చూడగానే వాళ్లిద్దరి విడాకుల గురించి నెట్టింట్లో విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. నెగెటివ్‌ కామెంట్లతో సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో నెటిజన్ ట్రోల్స్‌పై రామ్ గోపాల్ వర్మ కౌంటర్ వేశారు. వాళ్లకి లేని బాధ మీకేంటి? అని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్స్ చేశారు. ఆమిర్‌, కిరణ్‌రావు.. భవిష్యత్తులో మీ వ్యక్తిగత జీవితాల్లో ఎంతో సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను. ఇంతకుముందు లేని విధంగా ఇకపై మీ జీవితాలు మరింత కలర్ ఫుల్‌గా ఉండాలని ఆశిస్తున్నానంటూ వర్మ ట్వీట్ పెట్టారు. అంతేకాదు 'పెళ్లి కంటే విడాకులనే ఎక్కువగా సెలెబ్రేట్ చేసుకోవాలి' అంటూ తనదైన స్టైల్ కామెంట్ వదిలారు రామ్ గోపాల్ వర్మ. వివాహం అనేది మూర్ఖత్వం, అజ్ఞానంతో కూడినదని.. కానీ విడాకులు మాత్రం జ్ఞానం, తెలివితో కూడుకున్న పని అని ఆర్జీవీ సంచలన కామెంట్స్ చేశారు. పెళ్లి బంధంపై ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో కొత్త చర్చలకు దారి తీశాయి. 1986 సంవత్సరంలో రీనా దత్తాను పెళ్లాడిన .. 2002 వరకు ఆమెతో కాపురం చేసి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో కిరణ్‌రావుని రెండో వివాహం చేసుకొని ఇప్పుడు విడాకులు తీసుకోవడం హాట్ ఇష్యూ అయింది. 2011 సంవత్సరంలో ఆజాద్‌ అనే బాబుకి సరోగసి పద్ధతిలో ఆమీర్- దంపతులు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/369FMfI

No comments:

Post a Comment

''Have Muslims Faced Problems In Maharashtra?'

'We have given riot-free Maharashtra in our 18-month rule.' from rediff Top Interviews https://ift.tt/pLavVg8