Sunday, 4 July 2021

నాకు బోర్ కొడితే అంతే ఇక బలైపోవాల్సిందే.. అనుపమ వీడియో వైరల్

కేరళ సుందరి అనుపమా పరమేశ్వరణ్‌కు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ దక్కింది. కెరీర్ ప్రారంభంలో మంచి ఊపులో ఉన్న అనుపమకు సరైన హిట్లు పడలేదు. వచ్చిన భారీ ఆఫర్లను తిరస్కరించారు. అలా కొన్ని ప్రాజెక్ట్‌లు చేజారిపోయాయి. అయితే పక్కింటి అమ్మాయిలా కనిపించడం, మోడ్రన్ పాత్రల్లో చూసేందుకు తెలుగు ప్రేక్షకులు అంగీకరించలేదు. అలా అనుపమకు ఒకే రకమైన పాత్రలు వచ్చేవి. అలా అనుపమ కెరీర్ ఇప్పుడు డౌన్ ఫాల్‌లో ఉంది. చివరగా హలో గురు ప్రేమ కోసమే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది కూడా బోల్తా కొట్టింది. అయితే రాక్షసుడు సినిమా హిట్ అయినా కూడా క్రెడిట్ దక్కలేదు. అందులో అనుపమది నామమాత్రపు పాత్రే. అలా అనుపమకు ఇప్పుడు సినిమా ఆఫర్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం అనుపమ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అనుపమ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక తన సోదరుడితో కలిసి అనుపమ చేసే అల్లరి అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా అనుపమ ఓ వీడియోను షేర్ చేశారు. తనకు బోర్ కొడితే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించారు. నాకు బోర్ కొడితే ఇలా పక్కన ఉన్నవారికి పిచ్చెక్కిస్తాను.. బలైపోవాల్సిందేనంటూ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అనుపమ ప్రస్తుతం నిఖిల్ సరసన చిత్రంలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఓ సినిమాలోనూ చాన్స్ కొట్టేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3AuzjK6

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....