Sunday, 4 July 2021

దుమ్ములేపిన మ్యూజిక్ డైరెక్టర్.. వామ్మో తమన్‌లో కొత్త కోణం.. ప్రోమో వైరల్

ప్రస్తుతం టాలీవుడ్‌లో హవానే కొనసాగుతోంది. వరుస హిట్లతో తమన్ దూసుకుపోతోన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికీ అల వైకుంఠపురములో ఫీవర్ ఎవ్వరినీ వదలడం లేదు. ఎక్కడో చోట ఆ పాటలు ఇంకా మార్మోగిపోతూనే ఉంటున్నాయి. యూట్యూబ్‌లో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. కొన్ని వందల మిలియన్ల వ్యూస్‌తో అల వైకుంఠపురములో పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. అలాంటి పాటలు ఇచ్చిన తమన్ ఇప్పుడు మళ్లీ అందరినీ మెస్మరైజ్ చేసేందుకు బయల్దేరారు. అమెరికాలో ఉన్న తెలుగు ప్రేక్షకులను తమన్ తన సంగీతంతో ఉర్రూతలూగించనున్నారు. అల అమెరికాపురములో అనే ఈవెంట్ ద్వారా ఎన్నారైలను ఆకట్టుకోబోతోన్నారు. ఈ మేరకు ఓ ఈవెంట్‌ను తమన్ ప్లాన్ చేసేశారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా పూర్తయినట్టుంది. ఈ మేరకు వదిలిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో తమన్‌లోని కొత్త కోణం బయటకు వచ్చినట్టైంది. మామూలుగా స్టేజ్ ఎక్కితే తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. లైవ్ ఈవెంట్ పెట్టినా కూడా ఎక్కడా హడావిడి చేయరు. కానీ ఇప్పుడు మాత్రం తమన్ నిజంగానే దుమ్ముదులిపారు. తన స్టైల్, వాకింగ్ స్టైల్, యాటిట్యూడ్ అన్నీ కూడా వేరే లెవెల్‌లో ఉన్నాయి. డ్రమ్స్ వాయిస్తూ నిజంగానే దుమ్ములేపేశారు. ఇక ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ గురించి కూడా ట్వీట్ వేశారు. అల వైకుంఠపురములో సినిమాలో తమన్ సంగీతాన్ని అందరూ విన్నారు. అయితే అల అమెరికా పురములో ఈవెంట్‌లో ఆ మ్యాజిక్‌ను లైవ్‌లో చూడండి. ఆయన సంగీతాన్ని అమెరికాలో ఉన్న వారు సైతం ఎంజాయ్ చేస్తారు. ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలి బ్రదర్ అంటూ తమన్‌ను విషెస్ అందించారు బన్నీ. ఇక తమన్ మీద వదిలిన ప్రోమో మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3AucdDu

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....