Sunday, 4 July 2021

పొగిడినట్టే పొగిడి చురకలు అంటించిన ‘గృహలక్ష్మీ’ నటి.. సీఎంపై కస్తూరీ కామెంట్స్

నటి కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక సమాజంలో జరిగే ఎన్నో విషయాల మీద ఆమె స్పందిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆమె చేసే రాజకీయ విశ్లేషణలు ఎక్కువగా కాంట్రవర్సీకి దారి తీస్తుంటారు. ఈ మధ్య వరుసగా రజినీకాంత్ మీద విమర్శలు ఎక్కు పెడుతూనే వస్తున్నారు. ఇలాంటి సమయంలో రజినీకాంత్ అమెరికాకు ఎలా వెళ్లారంటూ ప్రభుత్వాలను సైతం వేలెత్తి చూపిస్తున్నారు. అలా రజినీ విషయంలో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వివాదానికి దారి తీశాయి. మొత్తానికి వైద్యం నిమిత్తం అక్కడికి వెళ్లారంటూ తనకు సమాధానం వచ్చిందని కస్తూరీ కాస్త శాంతించారు. కస్తూరీ మాత్రం రోజుకో విషయం మీద స్పందిస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటారు. తాజాగా కస్తూరీ శంకర్ సీఎం మీద కామెంట్లు చేశారు. నేడు స్టాలిన్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఉదయం పూట సైకిల్ తొక్కుతూ కనిపించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ మీద ప్రశంసలు కురిపించారు నెటిజన్లు. నటి కస్తూరి కూడా స్టాలిన్ చర్యను సమర్ధించారు. అయితే అంతలోనే స్టాలిన్ తప్పును ఎత్తిచూపించారు. ఎంకే స్టాలిన్ ఓ రాక్ స్టార్.. అద్భుతమైన సీఎం.. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే అని పొగడ్తల వర్షం కురిపించారు. కానీ సీఎం సార్ ప్రజల్లోకి ఇలా వచ్చినప్పుడు మాస్క్ ధరించండి..మీ ఫోటోలతో మాస్క్ ధరించడంపై అవగాహన కల్పించండి అని చురకలు అంటించారు. ప్రస్తుతం కస్తూరీ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక తెలుగు ప్రేక్షకులను ప్రస్తుతం గృహలక్ష్మీ సీరియల్‌తో తులసిగా కస్తూరీ ఆకట్టుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Trwt8p

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....