Sunday, 4 July 2021

పెళ్లి తర్వాత నిహారిక రొమాంటిక్ డోస్.. అలాంటోళ్ళు కామెంట్ చేయొద్దంటూ మెగా డాటర్ షాకింగ్ పోస్ట్!

సినిమా హీరోయిన్ కంటే ఎక్కువగా సెలబ్రిటీ కిడ్‌గా ఫుల్ ఫేమస్ అయింది. నట వారసత్వాన్ని కొనసాగించాలని ఆమె చేసిన ప్రయత్నాలు పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో పెళ్లి చేసుకొని సెటిలైపోయింది మెగా డాటర్. గతేడాది గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యతో ఏడడుగులు నడిచిన నిహారిక.. అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత మరింత యాక్టివ్ అయింది. ఈ నేపథ్యంలోనే 'అలాంటోళ్ళు నోరు మూసుకోండి' అనే అర్థం వచ్చేలా నిహారిక పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. పెళ్లి చేసుకున్నాక రూటు మార్చేసింది నిహారిక. మోడ్రన్ డ్రెస్సులతో రచ్చ చేస్తుండటమే గాక, భర్తతో కలిసి వీలు చిక్కినప్పుడల్లా రొమాంటిక్ టూర్స్ వేస్తూనే ఉంది. ఇక ఆయా ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా చైతన్యతో కలిసి వెకేషన్ ట్రిప్‌కి వెళ్ళింది నిహారిక. ఇద్దరూ కలిసి పాండిచ్చేరి అందాలను చుట్టేస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. అయితే అక్కడి హోటల్ రూమ్‌లో దిగిన ఓ హాట్ పిక్ షేర్ చేస్తూ నిహారిక చేసిన కామెంట్ వైరల్‌గా మారింది. అద్దంలో తన ప్రతిబింబాన్ని తానే చూసుకుంటున్న ఫోటో పోస్ట్ చేసి దానిపై 'పార్ధు ఇంకోసారి చూసి చెప్పు' అని కామెంట్ జత చేసింది. ఇంకేముంది నెటిజన్స్ తన గ్లామర్‌పై కామెంట్ చేయడం కామనే అని ముందే పసిగట్టిన నిహారిక.. ఓ కండీషన్ పెట్టింది. సరిగ్గా ఇలాంటి కామెంట్ ఏ సినిమాలో ఉందో గుర్తురాని వాళ్ళు దయచేసి కామెంట్ చేయొద్దు అని ఆమె పేర్కొంది. 'అతడు' మూవీలో త్రిష ఇలాగే తనను తాను అద్దంలో మహేష్‌కు చూపిస్తూ నేను అందంగా ఉన్నావో లేదో ఒక సారి అద్దంలో చూసి చెప్పు అని అంటుంది. ఆ సీన్ గుర్తు చేస్తూ తాను అందంగా లేనా ఇంకోసారి చూసి చెప్పు అని నిహారిక కామెంట్ చేసిందని చెప్పుకోవచ్చ్చు. ఏదేమైనా పెళ్లి తర్వాత నిహారిక గ్లామర్ డోస్ రెట్టింపవుతోందని అంటున్నారు నెటిజన్లు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hivD72

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....