Saturday, 18 July 2020

Rashmi Gautam: సుడిగాలి సుధీర్ రాత్రి యోగా.. రష్మి‌ హగ్ ఇచ్చిందని బుక్ చేశాడే!

ఎక్స్ ట్రా ఫన్.. ఎక్స్ ట్రా కామెడీ.. ఎక్స్ ట్రా పంచ్‌లతో ఈ వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ నవ్వుల విందు అందించగా.. అంతకు మించిన ఫన్‌తో వచ్చేవారానికి సంబంధించిన ఎపిసోడ్ రెడీ అయ్యింది. వచ్చే శుక్రవారం నాడు ప్రసారం అయ్యే ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేసింది మల్లెమాల. ఈ ప్రోమో విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్‌ని కొల్లగొట్టిందంటే కామెడీ స్టఫ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా విడుదలైన ప్రోమో సుడిగాలి సుధీర్ వన్ మ్యాన్ షో చేశాడు.. ఇతనికి రష్మి తోడు కలిస్తే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో జబర్దస్ ప్రియులకు ఓ ఐడియా ఉండనే ఉంటుంది. తాజాగా ఎపిసోడ్‌లోనూ రష్మి-సుధీర్‌ల మధ్య రొమాంటిక్ ఫన్ అదిరింది. కరోనా నేపథ్యంలో వేసిన స్కిట్‌లో బుల్లెట్ భాస్కర్ ఎస్ ఐగా సుధీర్ దగ్గరకు వచ్చి విచారణ చేపట్టాడు. ‘అప్పారావుని కలిసిన తరువాత ఎవర్నైనా కలిశారా అంటే.. లేదు సార్ అని ఆన్సర్ ఇచ్చాడు సుధీర్. నీ ఫోన్ కాల్ ట్రాక్ చేస్తే.. రాత్రి 12 గంటలకు అమీర్ పేట, 1 గంటకి లక్డీకపూల్, 2 గంటలకు పంజాగుట్ట.. ఏం చేస్తున్నావ్ ఈ టైంలో అంటే.. ‘నేను నైట్ టైం యోగా నేర్పిస్తా సార్’ అంటూ అమాయకంగా ఫేస్ పెట్టి జోక్ వేశాడు సుధీర్. నైట్ టైం యోగా ఏంటి?? పగలు నేర్పించవచ్చు కదా అంటే.. పగలు నేను నేర్చుకుంటా సార్ అంటూ పంచ్ పేల్చాడు సుధీర్. క్వారంటైన్‌కి నాతో పాటు ఎవర్నైనా తీసుకురావొచ్చా సార్.. అని బుల్లెట్ భాస్కర్‌ని అడగడంతో.. నువ్వేమైనా హనీమూన్‌కి వెళ్తున్నావా?? ఎవర్నైనా తీసుకువెళ్లడానికి?? అంటూ సీరియస్ అవుతాడు భాస్కర్. అది కాదు సార్.. ఈ మధ్యలో నేను ఒకర్ని కలిశాను.. అంటూ రష్మిని చూపిస్తాడు. నేను షేక్ హ్యాండ్ ఇద్దాం అని వెళ్తే ఆమె హగ్ చేసుకుంది అని రష్మిని ఇరికించే ప్రయత్నం చేశాడు సుధీర్. దీంతో అతనికీ నాకు సంబంధం లేదు సార్.. అతను ఎవరో నాకు తెలియదు అని రష్మి అంటే.. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి సార్.. మొత్తం మేమే ఉంటాం అంటూ పంచ్ వేశాడు సుధీర్. మొత్తానికి వీరి మధ్య జరిగిన ఈ ‘క్వారంటైన్’ స్కిట్ బాగానే పేలింది. అనంతరం హైపర్ ఆది, రాం ప్రసాద్‌, భాస్కర్‌లతో కలిసి చేసిన ‘హీరో’ స్కిట్‌ కూడా బాగానే పేలింది. హైపర్ ఆది ఎప్పటిలాగే తన పంచ్‌లతో సుధీర్‌ని ఓ ఆట ఆడుకున్నాడు. ‘ఓపెన్ చేస్తే మా వాడు దూరిపోతాడు’ అలాంటివి వద్దు లాంటి డబుల్ మీనింగ్ డైలాగ్‌ను సుధీర్‌పై పేల్చాడు హైపర్ ఆది. ఇక సత్తిపండు, వినోదిని స్కిట్‌లో కూడా బాగానే పండగా.. రాకింగ్ రాకేష్ ‘జానపద’ స్కిట్ ఓ ఊపు ఊపింది. మామా నాగులో అంటూ జానపద కళాకారులు పాడిన పాట.. జబర్దస్త్ స్టేజ్‌ని షేక్ చేసింది. ఉట్టిమీద కూడూ ఊరించినట్టు నువ్ ఊరించకే ముద్దు గుమ్మా అంటూ పాడిన పాట స్కిట్‌ను మరో రేంజ్‌కి తీసుకువెళ్లింది. మొత్తానికి వచ్చేవారం ప్రసారం అయ్యే.. ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎక్స్ ట్రా ఎంటర్ టైన్మెంట్‌ని అందించడం ఖాయమే అని ఈ ప్రోమోతో హింట్ ఇచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OBhbrp

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....