Saturday, 18 July 2020

చిరంజీవికి బిగ్ సర్ ప్రైజ్.. బర్త్‌డే గిఫ్ట్ రెడీ చేస్తున్న మెగా ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవికి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. చిరు అంటే పడి చచ్చే అభిమానులు చాలామంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు .. పక్క రాష్ట్రాల్లో కూడా మెగాస్టార్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు. ఇటీవలే సోషల్ మీడయాలోకి వచ్చిన సంగతి తెలిసిందే. చిరు ఇలా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వగానే అతని అభిమానులు లక్షల్లో ఆయనను ఫాలో అవ్వడం ప్రారంభించారు. చిరు చిన్న పోస్టు పెట్టగానే వెంటనే దాన్ని వైరల్ చేసేస్తున్నారు. వచ్చేనెల చిరు పుట్టినరోజు ఉంది. సోషల్ మీడియాలో చిరు వచ్చాక ఆయన జరుపుకుంటున్న మొట్టమొదటి బర్త్ డే ఇది. దీంతో సోషల్ మీడియా షేక్ అయ్యేలా చేసేందుకు ఘనంగా ప్లాన్ చేస్తున్నారు మెగా అభిమానులు. మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేసుకుందాం అనుకున్న అభిమానుల ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. అందుకే ఇప్పటికే రామ్ చరణ్ బర్తడే వేడుకలు కూడా చేయలేదు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో హీరోలంతా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. Read More: మాములుగా అయితే బిగ్ బాస్ బర్త్ డే కి ఫ్యాన్ హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. ఊరువాడా కేకులు , గల్లీకో పెద్ద కటౌట్ లు, రక్త దానాలు అంటూ సందడిగా చేసేవాళ్ళు మెగా ఫ్యాన్స్ . కానీ కరోనా కారణంగా ఈ సారి అవేవి జరిగేలా కనిపించడం లేదు . అయినా అభిమానులు మెగాస్టార్ పుట్టిన రోజు ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి సోషల్ మీడియాను షేక్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు చిరు అభిమానులు. మెగాస్టార్ బర్త్ డే ఆగస్తు 22న అని అందరికీ తెలిసిందే. దీంతో ఆగస్టు మొత్తం చిరు పుట్టిన రోజు సందడి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం కామన్ డీపీలు , యాష్ ట్యాగులు మెగాస్టార్ ఫొటోలతో రాక్ రచ్చ చెయ్యాలని అభిమానులు అనుకుంటున్నారు . అయితే చిరు బర్త్ డే కామన్ డీపీని ఇండియన్ టాప్ సెలెబ్రిటీలతో రిలీజ్ చేయించబోతోన్నారని సమాచారం.చిరు బర్త్ డే కోసం ఓ ప్రత్యేకమైన పాట కూడా కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం ఓ ప్రముఖ ఆడియో కంపెనీ పనులు కూడా మొదలు పెట్టింది. ఇవన్నీ చూస్తుంటే.. చిరు బర్త్ డేకు ఆయన అభిమానులు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చేలాగే ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jnYMN9

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....