Tuesday, 14 July 2020

Pawan Kalyan: పవన్‌పై అలీ షాకింగ్ ట్వీట్.. మిత్రద్రోహీ అంటూ జనసైనికులు ఆగ్రహం

రాజకీయంగా ఇద్దరి దారులు వేరైనా.. సినిమాల పరంగా.. వ్యక్తిగతంగానూ పవర్ స్టార్ పవర్ కళ్యాణ్, కమెడియన్ ఈ ఇద్దరూ మంచి మిత్రులు. అయితే గత ఎన్నికల్లో అలీ.. వైసీపీ పార్టీలో చేరడంతో పాటు తనను పార్టీలోకి పిలవలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పవన్‌తో అలీల మధ్య గ్యాప్ వచ్చింది. అయితే అలీ వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటూ టీవీ షోలతో తనపని తాను చేసుకుంటున్నారు. కాగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే‌ని పురస్కరించుకుని అలీ చేసిన ట్వీట్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో 20 రోజులు ముందుగానే.. అంటే జూలై 13 నుంచి ముందస్తు బర్త్ డే సెలబ్రేషన్స్ సోషల్ మీడియా ద్వారా మొదలుపెట్టేశారు ఆయన అభిమానులు. #PSPKAdvBdayTrendOnJuly13th హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ల వర్షం కురిపిస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ బర్త్ డే విషెష్ అందిస్తున్నారు. తాజాగా కమెడియన్ అలీ.. పవన్ కళ్యాణ్‌కు అడ్వాన్స్ బర్త్ డే విషెష్ అందిస్తూ ఆయన వ్యక్తిత్వంపై పొగడ్తల జల్లు కురిపించారు. ‘వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం.. గుణం.. వర్ణం గురించి మాట్లాడుతారు... ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా.. చెదరని నీ నవ్వుకి, నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు’ అంటూ దండం పెడుతున్న ఎమోజీతో పాటు లవ్ సింబర్ ఎమోజీని షేర్ చేశారు అలీ. తాజాగా రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ పేరుతో సినిమాను రూపొందిస్తూ.. పవన్ కళ్యాణ్‌ను కించపరిచే విధంగా కొన్ని పోస్టర్స్‌ను విడుదల చేసి ఆయన్ని, ఆయన ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అలీ ఈ పోస్ట్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పవన్ కళ్యాణ్‌పై అలీ చేసిన ట్వీట్‌పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని మాటలు అన్నా చెదరని చిరునవ్వా? ఆ మాటలు అన్నవాళ్లలో మీరూ ఒకరు కాదా? మీరు మా ప్రాణం పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలు మర్చిపోలేదు అలీ గారు, మీరు ఇప్పుడు ఆయన పేరు ఎత్తుకున్నా కానీ మేము మిమల్ని మళ్ళీ ఎత్తుకునే సమస్యే లేదు! జై జనసేన జై హింద్.. మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తుకు రాని నీకు.. నీ కన్న తల్లి చనిపోతే కనీసం సానుభూతి తెలపని వాడితో ఉంటూ.. ఆ పార్టీ కండువా కప్పి.. వాడి అవరాలకి వాడుకొని వదిలేసిన నిన్ను మళ్లీ మా పవన్ కళ్యాణ్ గారు ఎలా క్షమిస్తాడు మిస్టర్ అలీ’.. అంటూ అలీని మిత్రద్రోహిగా అభివర్ణిస్తున్నారు పవన్ అభిమానులు. ‘ నీ మిత్రద్రోహాన్ని మర్చిపోలేం.. నువ్ అన్న మాటలు మాకు ఇంకా గుర్తు ఉన్నాయి.. మీ ఇద్దరి మద్య స్నేహమే ఇలా మిమ్మల్ని ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడేలా చేసింది... అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని వదిలేసిన మీకు వ్యక్తిత్వం ఉందని నేను అనుకోవడం లేదు.. నువ్వు ఒక మనిషి రూపంలో ఉన్న మానవ సర్పానివి మిస్టర్ అలీ ఎందుకంటే నీ రాజకీయ సొంత ప్రయోనాల కోసం పవన్ కళ్యాణ్ గారిని వెన్ను పోటు పొడి చావు అది తెలియక నిన్ను తన స్నేహితుడి స్థానం ఇచ్చాడు.. కానీ నువ్వు పాముకి పాలు పోసిన విసం కక్కే గుణం కలిగిన సార్పానివి’.. అంటూ అలీపై ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు పవన్ ఫ్యాన్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fwsxbU

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....